ధర ఎంతో తెలుసా? : టయోటా Glanza G MT కొత్త కారు వచ్చేసింది 

Submitted on 14 October 2019
Toyota Glanza G MT launched, price starts at Rs 6.98 lakh

ప్రముఖ జపాన్ మోటార్ తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ వేరియంట్ మరో కొత్త కారు మోడల్ లాంచ్ చేసింది. మారుతీ సుజుకీ బాలెనో ఆధారిత ప్రీమియం హ్యాచ్ బ్యాక్ నుంచి న్యూ ఎంట్రీ లెవల్ గ్లాన్జా G MT వేరియంట్ ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ వేరియంట్ ధర రూ.6.98 లక్షలు (ఢిల్లీ ఎక్స్ షోరూం)గా అందుబాటులో ఉంది. టయోటా గ్లెన్జా జీ ఎంటీ కారు మోడల్స్ బుకింగ్స్ తమ కంపెనీ డీలర్ షిప్స్ దగ్గర ఓపెన్ అయ్యాయి. ఈ ఏడాది జూన్ 6న టయోటా గ్లెన్జా మోడల్ వేరియంట్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్లను లాంచ్ చేయగా.. 11వేలకు పైగా యూనిట్లు అమ్ముడుబోయాయి.

కేఫ్ వైట్, స్పోర్టిన్ రెడ్, ఇన్ స్టా బ్లూ, గేమింగ్ గ్రే, ఎన్టిసింగ్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. టయోటా గ్లాన్జా.. మారుతీ సుజూకీ బాలెనో, హుందాయ్ ఐ20, హుండా జాజ్ మోడల్ కార్లకు పోటీగా మార్కెట్లోకి వచ్చింది. కొత్త టయోటా గ్లాన్జా జీ ఎంటీ కారు.. BS-VI కంప్లయింట్ వెహికల్. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ సామర్థ్యంతో 82.9 PS, 113 Nm పీక్ టర్క్యూ ఉంది.

ఇందులో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆఫర్ చేస్తోంది. మైలేజ్ విషయానికి వస్తే.. గ్లాన్జా జీ ఎంటీ వేరియంట్ కారు 21.01 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కార్ మేకర్ టయోటా తెలిపింది. కొత్త టయోటా గ్లాన్జా జీ ఎంటీ వేరియంట్ ప్రామాణికంగా 3ఏళ్లు/1 లక్ష కిలోమీటర్ల వారంటీతో వస్తోంది. ఆ తర్వాత 5ఏళ్లు/2.20 లక్షల కిలోమీటర్లకు పొడిగించుకోవచ్చు.

స్పెషిఫికేషన్లు - ఫీచర్లు ఇవే :
* LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ (లైట్ గైడ్)
* LED రియర్ కాంబినేషన్ ల్యాంప్స్ 
*16అంగుళాల డైమండ్ కట్ అలోయ్ వీల్స్ 
* బాడీ కలర్ బంపర్, ORVM
* LED HMSLతో రియర్ రూఫ్ స్పాయిలర్
* రియర్ రూఫ్ యాంటినా
* డ్యుయల్ టోన్ సీట్ ఫ్యాబ్రిక్స్ (క్యాబిన్)
* ఫ్రంట్ సెంటర్ ఆర్మ్ సెట్ (స్టోరేజీ)
* గ్లోవ్ బాక్సు ఇల్లుమ్యూనేషన్
* ఇంజిన్ పుస్ స్టార్ట్ / స్టాప్ బటన్
* ట్లిట్, టెలిస్కోపిక్ స్టీరింగ్ 
* హైట్ అడ్జెస్టబుల్ డ్రైవర్ సీట్
* ఆటో AC, TFT MID
* స్మార్ట్ ప్లే క్యాస్ట్ టచ్ స్ర్కీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్
* డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్
* ABSతో EBD, BA, డ్రైవర్, కో డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్
* రివర్స్ పార్కింగ్ అసిస్ట్ సెన్సార్లు
* ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్
* స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్
* హై స్పీడ్ వార్నింగ్, ఇమ్ మొబిలైజర్

వేరియంట్లవారీగా ధరలు ఎంతంటే?
* టయోటా గ్లెన్జా జీ ఎంటీ - రూ. 6.98 లక్షలు
* టయోటా గ్లెన్జా G MT ( అడ్వాన్స్ డ్ Li-Ion బ్యాటరీ, ISG) : రూ. 7.22 లక్షలు 
* Toyota Glanza V MT - రూ. 7.58 లక్షలు
* Toyota Glanza G CVT - రూ. 8.30 లక్షలు
* Toyota Glanza V CVT - రూ. 8.90 లక్షలు

Toyota
Glanza G MT
BS-VI compliant
Glanza G MT variant
carmaker  

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు