రేపే పాలిసెట్ పరీక్ష : ఏర్పాట్లు పూర్తి

Submitted on 15 April 2019
Tomorrow Ploycet 2019  Entrance Exam 

హైదరాబాద్:  2019-20 విద్యాసంవత్సరంలో పాలిటెక్నిక్ కళాశాలల్లో  ప్రవేశాలకు గాను మంగళవారం జరిగే పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాటు  పూర్తి చేశారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్దులను గంటముందే అనుమతిస్తామని, విద్యార్థులు హాల్‌టిక్కెట్లు, హెచ్‌బీ పెన్సిల్‌, పెన్ను వెంట తెచ్చుకోవాలని అధికారులు వివరించారు.

సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు అనుమతి ఉండదని పేర్కొన్నారు. తొలిసారిగా విద్యార్థుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన యాప్‌ ద్వారా ఇందుకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చని పాలీసెట్ కన్వీనర్ తెలిపారు. పరీక్షలకు 5గురు అబ్జర్వర్లతో పాటు ప్రత్యేక అబ్జర్వర్‌, 15 మంది ఇన్విజిలేటర్ల నియమించారు.

TS polycet 2019
Exam. Entrance Exam
Telangana
 

మరిన్ని వార్తలు