సీఎం జగన్‌తో నిర్మాతల భేటీ..కారణం ఏంటంటే

Submitted on 26 February 2020
Tollywood delegation meets CM Jagan In Tadepalligudem

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సినీ పరిశ్రమపై దృష్టి సారించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ టాలీవుడ్ రంగానికి చెందిన ప్రముఖులతో భేటీలు నిర్వహించారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి ఎవరు వచ్చినా..వెల్ కం అంటూ చెబుతున్నారు. తాజాగా ఏపీ సీఎం జగన్‌తో తెలుగు ఇండస్ట్రీలోని ప్రముఖులు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

2020, ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం తాడేపల్లిలోని సీఎం నివాసంలో ఈ భేటీ జరిగింది. శ్యాంప్రసాద్ రెడ్డి, సురేష్ బాబు, నల్లమలుపు బుజ్జి, జెమిని కిరణ్, పాటు ఇతరులు సమావేశంలో ఉన్నారు. వీరితో పాటు గన్నవరం ఎమ్మెల్యే, సినీ నిర్మాత వల్లభనేని వంశీ కూడా ఉండడం విశేషం. భేటీ ముగిసిన అనంతరం వారు మీడియాకు వివరాలు తెలిపారు. 

విశాఖలో బీభత్సం సృష్టించిన హుదూద్ తుఫాన్‌కు లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని తెలిపారు. ఎందరో రోడ్డున పడ్డారని, ఇందుకోసం సినీ పరిశ్రమ నడుం బిగించి విరాళాలు సేకరించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. దాదాపు 15 కోట్ల వరకు నిధులు వచ్చాయన్నారు. వాటిని పోగు చేసి 320 ఇళ్లను నిర్మించామన్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్‌కు తెలియచేసినట్లు, ఇళ్ల ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించినట్లు వెల్లడించారు. దీనికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారన్నారు. ఇళ్లు కోల్పోయిన వారిలో కొందరికి ఈ ఇళ్లను ఇవ్వడం జరుగుతుందన్నారు.

Read More>>రాజేంద్రనగర్‌లో దారుణం : నగ్నంగా డ్యాన్స్ చేయాలంటూ మహిళపై

 

Tollywood delegation
meets
cm jagan
Tadepalligudem
Gannavaram MLA
Suresh Babu
Shyamprasad Reddy

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు