కొత్త నిబంధన : ఆర్టీఓ ఆఫీసుకు వెళుతున్నారా..డ్రెస్ కోడ్ ఉండాల్సిందే

Submitted on 23 October 2019
TN RTO says No Dress Code But To Safety

మీకు వెహికల్ ఉందా..డ్రైవింగ్ లెసెన్స్ కోసం ఆర్టీఓ ఆఫీసుకు వెళుతున్నారా..అయితే మీకు పక్కాగా డ్రెస్ కోడ్ ఉండాల్సిందే. అది మహిళలైనా..పురుషులైనా సరే..పద్ధతి ప్రకారం రావాలంటోంది చెన్నై ఆర్టీఏ. లైసెన్స్ కోసం ప్రత్యేక డ్రెస్ కోడ్‌లోనే రావాలంటున్నారు అధికారులు. సరియైన దుస్తులు ధరించి రావాలంటున్నారు. దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ప్రతి నిత్యం కొన్ని కారణాలతో ప్రజలు ఆర్టీఓ కార్యాలయానికి వస్తుంటారని, ఎలాంటి ఘటనలు జరుగకుండా ఉండేందుకు..సరైన దుస్తులు ధరించి రావాలని సూచిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆర్టీఓ ఆఫీసుకు ఇటీవలే ఓ యువతి వచ్చిందని..ఆమె జీన్స్ ప్యాంట్, స్లీవ్ లెస్ టాప్స్ ధరించిందని తెలిపారు. మరో మహిళ..ముఖాన్ని బట్టతో చుట్టుకొందన్నారు. మంచి దుస్తులు ధరించి రావాల్సిందిగా తాము సూచించినట్లు వెల్లడించారు. సరిగ్గా దుస్తులు ధరించమని అడగడంలో తప్పేంటీ అని ఓ ఆర్టీఓ అధికారి ప్రశ్నించారు. 

సంప్రదాయబద్ధమైన దుస్తులు లేదా పంజాబీ, సల్వార్ కమీజ్‌లు ధరించి వస్తేనే..డ్రైవింగ్ టెస్టు‌లను నిర్వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కొత్త మోటార్ వెహికల్ యాక్టు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో పొందుపర్చిన నిబంధనలను అనుగుణంగా తాము ఈ చర్యలు తీసుకుంటున్టు ఆర్టీఓ అధికారులు ప్రకటిస్తున్నారు. డ్రైవింగ్ టెస్టుల కోసం..తాము విద్యా సంస్థలు, కార్యలయాలకు సెలవు పెట్టి వస్తే..అధికారుల తీరుతో విసుగు చెందుతున్నట్లు పలువురు వాపోతున్నారు. అకారణంగా యువతులకు లైసెన్స్ కోసం నిర్వహించే పరీక్షలు నిర్వహించకుండా..ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రవాణా శాఖ నుంచి సడలింపులు వచ్చేంత వరకు తాము ఇదే విధానాన్ని కొనసాగిస్తామంటున్నారు. 

TN RTO
No Dress Code
Chennai

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు