టిక్‌టాక్‌ : ప్రేమ పేరుతో యువకుడి మోసం

Submitted on 8 November 2019
tick talk love shock to girl

అనంతపురం జిల్లా దర్గాహొన్నూరులో టిక్‌టాక్‌ మోసం జరిగింది. టిక్‌టాక్‌ చేసే ఓ వ్యక్తి ప్రేమ పేరుతో మైనరును ట్రాప్‌ చేశాడు. ఫోన్లోనే పెళ్లి చేసుకుందామన్నాడు. ఇంటికి రమ్మని చెప్పి .. తీరా వచ్చాక మాట మార్చాడు. 

దర్గాహొన్నూరుకు చెందిన అబ్బాయి టిక్ టాక్ వీడియోలు చూసి ప్రేమన్నాడు. ఫోన్లో పెళ్లి చేసుకుందామన్నాడు. తీరా ఇంటికి రమ్మని చెప్పి.. తూచ్ అనే సరికి.. ఈ అమ్మాయికి ఏమీ అర్థం కాలేదు.

అబ్బాయి చేసిన నిర్వాకం.. వాళ్ల తల్లిదండ్రులు చేసిన గొడవ గురించి.. కల్యాణదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాళ్లు.. ఉజ్వల హోం మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్‌కు తరలించారు. అమ్మాయి ఇంకా మైనర్ కావడంతో.. ఆమె తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తామని తెలిపారు పోలీసులు. కాగా నాలా ఎవరూ మోసపోవద్దని బాధితురాలు తెలిపింది.

tick talk
Love
Shock
Girl
ananthapuram

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు