ఏపీ అసెంబ్లీ : మరో ముగ్గురికి విప్‌

Submitted on 12 June 2019
Three new Whips in AP Assembly

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ప్రభుత్వ విప్‌లుగా మరో ముగ్గురికి అవకాశం దక్కింది. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విప్‌లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇప్పటికే సీఎం జగన్.. ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్‌లుగా నియమించారు. వీరిలో రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డిని చీఫ్‌ విప్‌గా నియమించగా... రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాడుగు ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడులను విప్‌లుగా నియమించారు. ప్రస్తుతం మరో ముగ్గురి నియామకంతో మొత్తం విప్‌ల సంఖ్య ఎనిమిదికి చేరింది. గతంలో ప్రకటించిన పార్థసారథి పేరు తొలగించారు.

మంత్రి పదవి ఆశించిన వీరు అసెంబ్లీ సమావేశాలకు ముందు సీఎం జగన్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ తర్వాతే ఈ నిర్ణయం వెలువడింది. రోజాకి కూడా విప్ హోదా వస్తుందనే ప్రచారం జరిగినా.. అందుకు ఆమె విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. రెండేళ్ల తర్వాత మంత్రి పదవికే ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.

Three
new Whips
AP Assembly
Amaravathi

మరిన్ని వార్తలు