పేరంట్స్ షాక్ : చనిపోయిన చిన్నారి.. 30ఏళ్ల తర్వాత అబ్బాయిలా మారి వచ్చింది

Submitted on 17 October 2019
Three Decades After Her Parents Thought She'd Died, She Returned In Their Lives But As A Son

ఆమెకు 17 ఏళ్లు.. ఆడపిల్లకు జన్మనిచ్చింది. పుట్టిన 15 నిమిషాలకే బిడ్డ దూరమైంది. పురిటిలోనే తన బిడ్డ చనిపోయిందని తల్లి చెప్పడంతో ఎంతో కుమిలిపోయింది. కానీ, మూడేళ్ల తర్వాత చనిపోయిందనుకున్న తన బిడ్డ తిరిగి వచ్చింది. కానీ, ఆడపిల్లలా కాదు.. అబ్బాయిలా మారి తమ దగ్గరకు చేరుకుంది. తన కూతురు బతికే ఉందని సంతోషించిన టినా బెజార్నో అబ్బాయిలా మారడం చూసి షాక్ అయింది. అమ్మాయి అయినా అబ్బాయి తన బిడ్డే కదా అని ఆనందపడింది. బెజార్నో గర్భం దాల్చడం ఆమె తల్లికి ఇష్టం లేదు. అందుకే పుట్టగానే తన మనమరాలిని మరో కుటుంబానికి దత్తతగా ఇచ్చేసింది. 

కూతురితో పుట్టిన బిడ్డ చనిపోయిందని చెప్పింది. అప్పటి నుంచి బెజార్నో, ఆమె భర్త ఎరిక్ గార్డెరే తమ బిడ్డ పుట్టిన రోజున సెలబ్రేట్ చేసుకోనేవారు. బిడ్డ చనిపోయిందని తెలిసి తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. అలా మూడు దశబ్దాలు గడిచిన తర్వాత ఎరిక్ కుమార్తె డీఎన్ఏ టెస్టు చేయించుకుంది. అప్పుడే తన తల్లిదండ్రులు ఎవరో తెలిసింది. అప్పటికే 29ఏళ్ల వయస్సు ఉన్న యువతి కాస్తా అబ్బాయిలా మారింది. తన పేరంట్స్ ఎవరో తెలుసుకుని వారికి ఈమెయిల్ ద్వారా తాను బతికే ఉన్నట్టు చెప్పింది. 

ఆ తర్వాత బిడ్డను కలిసినందుకు సంతోషపడింది. ‘నేను పట్టించుకోను. అబ్బాయిలా మారడాన్ని నేను పట్టించుకోను. అతడు నా బిడ్డ. అతడు బతికి ఉన్నాడు చాలు. అదే సంతోషం’ అని బెజార్నో బోరున విలపించింది. అతడి పేరు క్రిస్టన్. లాస్ వేగాస్ లో పెరిగాడు. కానీ, న్యూజెర్సీలో తన భార్యాబిడ్డలతో కలిసి ఉంటున్నాడు. ఈ ఏడాది నవంబర్ లోనే తన తల్లిని తొలిసారిగా లాస్ బనోస్ లో కలిశాడు. 

Three Decades
Parents
Son
Tina Bejarano
Eric Gardere
Kristin 

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు