వైఎస్ వివేకా హత్య కేసు: కడప నుంచి పులివెందుల జైలుకు నిందితులు

Submitted on 20 May 2019
 Three arrested accuses in YS Vivekananda Reddy murder case remand continues till june 3rd

మాజీ మంత్రి, రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు కోర్టు మరోసారి రిమాండ్‌ పొడిగించింది. ఈ హత్యకేసులో అరెస్ట్ అయిన  ముద్దాయిలు ఎర్రం గంగిరెడ్డి, కృష్ణా రెడ్డి (పీఏ), ప్రకాష్ (డ్రైవర్)లను పులివెందులలోని జూనియర్ సివిల్ కోర్టులో పోలీసులు హాజరుపరచగా వారి రిమాండ్‌ను పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జడ్జి అశోక్ కుమార్ నిందితులకు జూన్ 3 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో ఎన్నికలకు ముందు సంచలనం రేపిన ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయటం మిన‌హా ఎటువంటి విషయాలు బయటకు రాలేదు.

అయితే కడపలోని సెంట్రల్ జైల్ నుంచి పులివెందులలోని సబ్ జైలుకు తమను తరలించాలని నిందితులు పెట్టుకున్న పిటిషన్‌పై న్యాయమూర్తి విచారణ జరిపారు. వారి అభ్యర్థనను పరిగణలోని తీసుకున్న కోర్టు.. ముగ్గురు నిందితులను పులివెందులలోని సబ్ జైలుకు తరలించాలని ఆదేశించింది. అయితే ఈ కేసు విషయంలో ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ys vivekananda reddy
murder case
REMAND

మరిన్ని వార్తలు