టీవీ యాంకర్ అనుమానాస్పద మృతి

Submitted on 9 April 2020
Telugu tv anchor shanthi suspected death hyderabad

తెలుగు టీవీ యాంకర్, సీరియల్ నటి శాంతి( విశ్వశాంతి) అనుమానాస్పదంగా మృతి చెందారు. ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎల్లారెడ్డి గూడ ఇంజనీర్స్‌ కాలనీలోని తన నివాసంలో గురువారం ఆమె శవమై కనిపించారు.

గత 4  రోజులుగా ఇంట్లోంచి  ఆమె  బయటకు రాకపోవటంతో అనుమానం వచ్చి చుట్టు పక్కల  వారు పోలీసులకు సమాచారం అందించటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆమె ఎలా చనిపోయిందనే దానిపై చుటుపక్కల వారిని విచారిస్తున్నారు. ఇంట్లో తనిఖీలు చేసి ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీసీ పుటేజీలను పరిశీలించారు.  పోస్టు మార్టం నివేదిక ఆధారంగా విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. ఆమె స్వస్ధలం విశాఖ జిల్లా.

Telangana
Sucide Attempt
TV anchor
serial actress
Hyderabad

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు