Telangana New Pension: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. కొత్త పింఛన్ల మంజూరుపై కీలక అప్డేట్.. వారందరికీ శుభవార్త..

Telangana New Pension : తెలంగాణలో సామాజిక భద్రతా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది.

Telangana Government Key Decision Pensions To Be Extended To Another 11275 Beneficiaries

Telangana Govt New Pension: తెలంగాణలో సామాజిక భద్రతా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. ఫైలేరియా, ఎయిడ్స్, డయాలసిస్ బాధితులకు కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు చేసింది. ఈ మేరకు మరో 11,275 మందికి పింఛన్లు మంజూరు చేస్తూ సంబంధిత ఫైల్‌పై మంత్రి సీతక్క సంతకం చేశారు. దీంతో రాష్ట్రంలో కొత్తగా మంజూరైన చేయూత పింఛన్ల సంఖ్య 4,75,132కు చేరింది.

Also Read : TVK MLA VS Babu : తమిళనాడులో మళ్లీ ఎన్నికలు..! అసెంబ్లీలో అడుగుపెట్టనున్న స్టాలిన్?

నూతనంగా మంజూరు చేసిన 11,275 పింఛన్లలో ఫైలేరియా బాధితులకు 5,895, ఎయిడ్స్ బాధితులకు 3,024, డయాలసిస్ రోగులకు 2,356 పింఛన్లు కేటాయించారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈ నిర్ణయం కొంత ఊరటనివ్వనుంది.

తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే వివిధ అర్హతల కింద 4,63,857 మందికి కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు చేసింది. తాజాగా మరో 11,275 మందికి ఆమోదం తెలపడంతో ఈ సంఖ్య 4,75,132కు చేరింది. అర్హులైన పేదలకు సామాజిక భద్రత కల్పించడంతో పాటు ఆర్థికంగా అండగా నిలవడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పింఛన్ సొమ్మును జమ చేయనున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వెల్లడించారు. కొత్తగా పింఛన్లు మంజూరు కావడంతో ఫైలేరియా, ఎయిడ్స్, డయాలసిస్ బాధిత కుటుంబాలకు నెలవారీ ఆర్థిక భరోసా లభించనుంది.