CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డితో మహేశ్‌బాబు భేటీ.. కారణం ఏమిటంటే? వీడియో వైరల్
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ హీరో మహేశ్ బాబు భేటీ అయ్యారు.
- Harish Thanniru
- Updated on- November 29, 2026 / 09:09 AM IST
Film actor Mahesh Babu met with CM Revanth Reddy
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ హీరో మహేశ్ బాబు భేటీ అయ్యారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సీఎంతో ఆయన శనివారం మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. తొలుత సీఎంకు మహేశ్ బొకే అందజేశారు. ఆ తరువాత మహేశ్ బాబుకు శాలువాకప్పి సీఎం రేవంత్ సత్కరించారు. ఇద్దరూ ఆప్యాయంగా పలుకరించుకున్నారు. అనంతరం కొద్దిసేపు పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. అయితే, వీరిద్దరూ ఏఏ అంశాలపై చర్చించుకున్నారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Also Read : Telangana IAS Transfer : తెలంగాణలో భారీ ఐఏఎస్‌ల బదిలీలు.. 8 మంది అధికారులకు కొత్త బాధ్యతలు!
సీఎంతో అనన్య బిర్లా భేటీ..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శనివారం స్వతంత్ర మైక్రోఫిన్ చైర్‌పర్సన్, యువ పారిశ్రామికవేత్త అనన్య బిర్లా మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో సీఎం రేవంత్ రెడ్డి కలిసిన అనన్య చర్చల సందర్భంగా తెలంగాణ రైజింగ్‌కు సంపూర్ణ మద్దతు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అనన్య బిర్లాను డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. ఈ క్రమంలోనే తెలంగాణలో పెట్టుబడులకు అనన్య ఆసక్తిని వ్యక్తీకరించారు.
ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి..
సీఎం రేవంత్ రెడ్డి శనివారం రాత్రి ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ పాలిక కర్ణాటక, కేరళ, హిమాచల్ ప్రదేశ్ సీఎంలతో కలిసి రేవంత్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం 12గంటలకు ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లును వ్యతిరేకిస్తున్న ఇండియా కూటమి తరపున గట్టిగా వాదనలు వినిపించనున్నారు. డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే జరిగే నష్టాలను వారు వివరిస్తారని తెలుస్తోంది. అదేవిధంగా పార్లమెంటులో అనుసరించాల్సిన విధానంపైనా పార్టీ ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీలకు విప్ జారీ చేసినందున ఆదివారం ఉదయం 10గంటల వరకు ఢిల్లీలో ఉండాలని రాష్ట్రంలోని పార్టీ ఎంపీలకు సీఎం సూచించినట్లు సమాచారం.
