Vivo Y05s Launch : తక్కువ బడ్జెట్‌లో వివో కొత్త ఫోన్ వస్తోందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ధర ఎంత ఉండొచ్చంటే?

Vivo Y05s Launch : వివో Y05s త్వరలో మార్కెట్‌లోకి రానుంది. 6,500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 4GB RAM ఫీచర్లతో రానున్న ఈ ఫోన్ ధర ఎంత ఉండొచ్చు? వివో Y05 కొనాలా? వివో Y05s కోసం వేచి చూడాలా? ఇప్పుడు తెలుసుకుందాం..

Vivo Y05s Launch

  • 6,500mAh బ్యాటరీతో Vivo కొత్త ఫోన్ వస్తోంది
  • 120Hz డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో రానుంది
  • వివో Y05s ఫీచర్లు, ధరపై ఓ లుక్కేయండి

Vivo Y05s Launch : బడ్జెట్ ధరలో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే, వివో నుంచి కొత్త ఫోన్ రాబోతుంది.. అదే.. వివోY05s ఫోన్.. ఈ ఫోన్ ఇంకా అధికారికంగా మార్కెట్‌లోకి రాలేదు. అయితే, గూగుల్ ప్లే కన్సోల్‌లో V2668 అనే మోడల్ నంబర్‌తో కనిపించింది. దాంతో టెక్ వర్గాల్లో ఆసక్తి మొదలైంది. ఇప్పటికే మార్కెట్లో దొరికే వివో Y05కు అప్‌గ్రేడ్‌గా వచ్చే అవకాశం ఉంది.. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..

వివో వి05s ఫీచర్లు ఇవేనా? :
లీకైన వివరాల ప్రకారం.. ఈ ఫోన్‌లో 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఉండొచ్చు. ముఖ్యంగా 120Hz రిఫ్రెష్ రేట్ కారణంగా స్క్రోలింగ్, వీడియోలు చూసే సమయంలో అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ అందించనుంది. యూనిసోక్ టీ7225 ప్రాసెసర్, 4GB ర్యామ్, 64GB స్టోరేజ్‌తో ఈ ఫోన్ వచ్చే ఛాన్స్ ఉంది..

Read Also : Top Small Family Cars : తక్కువ బడ్జెట్‌లో మంచి ఫ్యామిలీ కారు.. రూ.10 లక్షల లోపు అదిరిపోయే 5 బెస్ట్ కార్లు!

కెమెరాల విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ 8MP కెమెరా, సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 5MP కెమెరా ఉండొచ్చని అంచనా.. ఇక ఈ ఫోన్‌లో 6,500mAh భారీ బ్యాటరీ స్పెషల్ అట్రాక్షన్.. దీనికి 15W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండొచ్చు.. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆర్జిన్ఓఎస్ 6తో పాటు మిడ్ నైట్ బ్లూ, చాంపియన్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రావొచ్చని తెలుస్తోంది..

వివో Y05 కొనాలా? వివో Y05s కోసం ఆగాలా? :
ప్రస్తుతం భారత్‌లో వివో Y05 సుమారు రూ.14,999 నుంచి రూ.15,999 ధరల మధ్య అందుబాటులో ఉంది. భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, IP65 రేటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే, కెమెరాలు, ప్రాసెసింగ్ పరంగా బేసిక్ అవసరాలకు మాత్రమే సరిపోతుంది. అందులో ఫోన్ కాల్స్, వాట్సాప్, సోషల్ మీడియా, వీడియోలు చూసేందుకు ఈ ఫోన్ బెటర్.. గేమింగ్, ఫొటోగ్రఫీ చేసేవారికి మాత్రం పెద్దగా నచ్చకపోవచ్చు.

మరి ఏది బెస్ట్? :
ప్రాసెసర్, కెమెరా అప్‌గ్రేడ్ కావాలంటే వివో వి05s ఫోన్ కోసం వెయిట్ చేయొచ్చు. లేదంటే ప్రస్తుతం వివో Y05 కొనడం బెస్ట్ ఆప్షన్.. అయితే, వివో Y05s ధర, ఫీచర్లపై వివో అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే..