Vivo X500e Launch : 7200mAh బ్యాటరీ.. 50MP కెమెరాలు.. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌.. వివో నుంచి అదిరిపోయే కొత్త ఫోన్..!

Vivo X500e Launch : వివో X500e గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. 7200mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరాలు, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్, 144Hz అమోల్డ్ డిస్‌ప్లే సహా పూర్తి ఫీచర్లు ఎలా పొందాలో చూద్దాం..

Vivo X500e Launch

  • 50MP సోనీ కెమెరా, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్..
  • సన్నని డిజైన్‌తో భారీ బ్యాటరీ.. IP69 రేటింగ్‌
  • 7200mAh బ్యాటరీతో Vivo X500e గ్లోబల్ లాంచ్..

Vivo X500e Launch : వివో లవర్స్ మీకోసమే.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో ఫోన్లు తీసుకొస్తున్న వివో.. తాజాగా మరో కొత్త ఫోన్‌ను ప్రపంచ మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే వివో X500e ఫోన్.. భారీ బ్యాటరీ, అదిరిపోయే కెమెరాలు, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్ ఇప్పుడు టెక్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా కేవలం 7.69mm మందంతో 7200mAh బ్యాటరీని అందిస్తుంది.

వివో X500e ధర, కలర్ ఆప్షన్లు :
వివో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను రష్యా మార్కెట్లో లాంచ్ చేసింది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్, 8GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, కంపెనీ ఇప్పటివరకు ధరను అధికారికంగా ప్రకటించలేదు. గ్రీన్, గ్రే కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తుంది..

డిస్‌ప్లే, ప్రాసెసర్ ఎలా ఉన్నాయంటే? :
వివో X500eలో 6.59 అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే ఇచ్చారు. 144Hz రిఫ్రెష్ రేట్, 5,000 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 8GB ర్యామ్, 512GB వరకు స్టోరేజ్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 17 ఆధారిత ఆర్జిన్ఓఎస్ 7తో వస్తుంది.

Read Also : ATM Withdrawal Rules : ఏటీఎంలో ఎక్కువసార్లు డబ్బులు తీస్తే ఛార్జీలు పడతాయా? ఆర్‌బీఐ కొత్త రూల్స్ ఇవే!

కెమెరాలే అసలైన హైలైట్ :
ఫొటోగ్రఫీ ఇష్టపడేవారికి ఇందులో మంచి కెమెరా సెటప్ ఉంది. బ్యాక్ సైడ్ 50MP సోనీ LYTIA 700V మెయిన్ కెమెరాను OIS సపోర్ట్‌తో అందించారు. దీనికి 3X ఆప్టికల్ జూమ్ ఉన్న 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, ఇతర ఫీచర్లు :
ఈ ఫోన్‌లో 7200mAh బ్లూ వోల్ట్ బ్యాటరీ ఉంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కేవలం 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. IP68, IP69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్స్ కూడా ఉన్నాయి. అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, NFC, eSIM, బ్లూటూత్ 5.4 వంటి ఫీచర్లు ఉన్నాయి. మొత్తం మీద సన్నని డిజైన్‌లో భారీ బ్యాటరీ, మంచి కెమెరాలు కోరుకునే వారికి ఈ ఫోన్ అద్భుతమైన ఆప్షన్‌..