iPhone Users Alert : ఐఫోన్ యూజర్లకు బిగ్ అలర్ట్.. మీ ఫోన్ ఏ క్షణమైనా హ్యాక్ అవ్వొచ్చు.. అర్జెంట్‌గా ఈ పనిచేయండి..!

iPhone Users Alert : ఐఫోన్ యూజర్లకు టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ దురోవ్ కీలక హెచ్చరిక జారీ చేశారు. పాత iOS వెర్షన్లతో హ్యాకింగ్ రిస్క్ ఉందని హెచ్చరించారు. ఐఫోన్‌ను సురక్షితంగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

iPhone Users Alert

  • ఐఫోన్ వాడుతున్నారా? మీ వ్యక్తిగత డేటా డేంజర్‌లో
  • వెబ్‌సైట్ ఓపెన్ చేసినా చాలు.. ఐఫోన్లు హ్యాకింగ్
  • ఐఫోన్ యూజర్లకు టెలిగ్రామ్ ఫౌండర్ హెచ్చరిక..

iPhone Users Alert : స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ప్రపంచం మొత్తం మన గుప్పిట్లో ఉన్నట్టే.. అయితే, అదే ఫోన్‌లో చిన్న సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ మిస్ అయితే మాత్రం వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐఫోన్ వాడుతున్నవారికి ఇప్పుడు ఓ కీలక హెచ్చరిక జారీ అయింది. పాత iOS వెర్షన్లు ఉపయోగిస్తున్న ఐఫోన్లపై సైబర్ దాడులు జరిగే ప్రమాదం ఉందని టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ హెచ్చరించారు..

ఆయన చెప్పిన విషయం మరింత ఆందోళన కలిగిస్తోంది.. ఐఫోన్‌లో ఏదైనా అనుమానాస్పద యాప్ డౌన్‌లోడ్ చేయకపోయినా, హానికరమైన వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయడం వల్లే ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పాత సాఫ్ట్‌వేర్‌లో ఉండే భద్రతా లోపాలను ఆసరాగా చేసుకుని హ్యాకర్లు ఈ తరహా దాడులకు పాల్పడవచ్చని వెల్లడించారు..

Read Also : Upcoming Smartphones : కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? డిసెంబర్‌లో లాంచ్ కానున్న టాప్ స్మార్ట్‌ఫోన్లు.. ఫుల్ లిస్ట్ ఇదే..

వెబ్‌సైట్ చూస్తేనే ప్రమాదమా? :
సాధారణంగా మనం రోజూ ఎన్నో వెబ్‌సైట్లు ఓపెన్ చేస్తుంటాం.. వార్తలు చదవడం, వీడియోలు చూడటం, లింకులు క్లిక్ చేయడం వంటివి చేస్తుంటాం.. అయితే, కొన్ని హానికరమైన వెబ్‌సైట్లు ప్రత్యేకంగా రూపొందించిన కోడ్ ద్వారా పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లలోని లోపాలను ఉపయోగించుకోవచ్చు.

తద్వారా వ్యక్తిగత సమాచారం, ఫోన్‌లోని డేటా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి ముప్పులపై గతంలో ఆపిల్ కూడా భద్రతా హెచ్చరికలు జారీ చేసింది. సమస్యలను పరిష్కరించేందుకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను రిలీజ్ చేసింది.

ఐఫోన్‌ను సురక్షితంగా వాడాలంటే :
మీ ఐఫోన్‌లో లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి. ఇందుకోసం సెట్టింగ్స్ ఓపెన్ చేసి (General)లోకి వెళ్లి (Software Update)పై క్లిక్ చేయాలి. అప్‌డేట్ అందుబాటులో ఉంటే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అలాగే (Automatic Updates) ఆన్‌లో ఉంచుకోవడం మంచిది.

స్మార్ట్‌ఫోన్ భద్రత విషయంలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యకు దారితీయొచ్చు. అనుమానాస్పద లింకులకు దూరంగా ఉండటంతో పాటు ఫోన్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం మర్చిపోవద్దు..