Samsung Galaxy S24 FE : రూ.39,999కే శాంసంగ్ గెలాక్సీ S24 FE.. 3X జూమ్ కెమెరా, 7 ఏళ్ల అప్‌డేట్స్.. కొనాలా? వద్దా?

Samsung Galaxy S24 FE : ఈ శాంసంగ్ ఫోన్ రూ.39,999 ధరకు అందుబాటులో ఉంది. 50MP కెమెరా, 3X ఆప్టికల్ జూమ్, అమోల్డ్ డిస్‌ప్లే, 7 ఏళ్ల అప్‌డేట్స్, బ్యాంక్ ఆఫర్ల వివరాలివే..

Samsung Galaxy S24 FE

  • శాంసంగ్ ఫోన్ కొనాలనుకుంటున్నారా?
  • రూ.40 వేల లోపే అదిరిపోయే ఆప్షన్
  • కెమెరా, డిస్‌ప్లే, ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే

Samsung Galaxy S24 FE : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి శాంసంగ్ నుంచి అద్భుతమైన ఆఫర్.. ముఖ్యంగా ప్రీమియం ఫీచర్లతో మరీ ఎక్కువ బడ్జెట్ పెట్టకూడదనుకునే వారికి శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ ఫోన్ అద్భుతమైన ఆప్షన్.. ప్రస్తుతం ఈ శాంసంగ్ ఫోన్ 128GB వేరియంట్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో సుమారు ధర రూ.39,999కు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లు, కార్డ్ డిస్కౌంట్లు కలిస్తే ధర మరింత తగ్గే అవకాశం ఉంది. పూర్తి వివరాలివే..

కెమెరా విషయంలో తగ్గేదేలే :
ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP మెయిన్ కెమెరాతో పాటు 12MP అల్ట్రా వైడ్ కెమెరా, 8MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ముఖ్యంగా 3X ఆప్టికల్ జూమ్ సపోర్ట్ ఉంది. ఫొటోలు, వీడియోలకు పర్ ఫక్ట్ అని చెప్పొచ్చు.. సెల్ఫీల కోసం 10MP ఫ్రంట్ కెమెరా అమర్చారు. పగటిపూట ఫొటోలు బాగానే వస్తాయి. అయితే తక్కువ వెలుతురులో కెమెరా పర్ఫార్మెన్స్ మరింత మెరుగ్గా ఉంటే బాగుండు..

Read Also : OPPO Reno 17 Series : ఒప్పో కొత్త రెనో 17 సిరీస్ ఫోన్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు..!

డిస్‌ప్లే, ప్రాసెసర్ ఎలా ఉన్నాయంటే? :
గెలాక్సీ S24 ఎఫ్ఈలో 6.7 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఎక్సినోస్ 2400e ప్రాసెసర్, 8GB ర్యామ్, రోజువారీ పనులు, గేమింగ్‌కు అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. 4,700mAh బ్యాటరీ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు.. అయితే, 25W ఛార్జింగ్ స్పీడ్ మాత్రం కొంత నిరాశపరుస్తుంది..

ధరకు తగ్గ ఫోనా? కాదా? :
ఈ ఫోన్‌లో మరో పెద్ద ప్లస్ పాయింట్ ఒకటే.. ఏకంగా 7 ఏళ్ల పాటు OS, సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని శాంసంగ్ ప్రకటించడమే.. 256GB వేరియంట్ ధర సుమారు రూ.45,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొన్ని బ్యాంక్ ఆఫర్లతో రూ.37,999 వరకు సొంతం చేసుకోవచ్చు.

మొత్తంగా చూస్తే రూ.40 వేల బడ్జెట్‌లో టెలిఫోటో కెమెరా, మంచి డిస్‌ప్లే, లాంగ్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ కావాలనుకునేవారికి గెలాక్సీ S24 ఎఫ్ఈ బెస్ట్ ఆప్షన్. అయితే బ్యాటరీ, ఛార్జింగ్ పరంగా అంతగా ఉండదు. కొనేముందు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో మీ బ్యాంక్ కార్డుపై ఆఫర్లు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి..