Redmi Note 18 5G Leak : వావ్.. కొత్త రెడ్‌మి నోట్ 18 5G సిరీస్ వస్తోందోచ్.. భారీ బ్యాటరీ అదుర్స్, ఫీచర్లు ముందే లీక్..!

Redmi Note 18 5G Leak : రెడ్‌మి నోట్ 18 5జీ భారీ అప్‌డేట్‌తో రాబోతుంది? 8,888mAh బ్యాటరీ, 50MP కెమెరా, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో రెడ్‌మి నోట్ 18 ప్రో మాక్స్ ఫీచర్లు లీక్ అయ్యాయి..

Redmi Note 18 5G Leak

  • బ్యాటరీ విషయంలో తగ్గేదేలే అంటున్న రెడ్‌మి..
  • రెడ్‌మి నోట్ 18 5జీ ఫోన్ స్పెసిఫికేషన్లు లీక్
  • 8,888mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్.. భారీ అంచనాలు

Redmi Note 18 5G Leak : రెడ్‌మి యూజర్లకు పండగే.. అతి త్వరలో భారీ బ్యాటరీతో సరికొత్త రెడ్‌మి 5G స్మార్ట్‌ఫోన్ రాబోతుంది. ఈ ఫోన్ ఎంత బాగున్నా బ్యాటరీ త్వరగా అయిపోతే మాత్రం ఇబ్బందే.. అందుకే ఎక్కువ బ్యాటరీ సామర్థ్యంతో వచ్చే ఫోన్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ఇదే విషయంలో రెడ్‌మి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రెడ్‌మి నోట్ 18 5జీ త్వరలో మార్కెట్లోకి రానుంది. దీనికి సంబంధించి పూర్తి ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి..

8,888mAh బ్యాటరీతో కొత్త ఫోన్ :
లేటెస్ట్ లీకుల ప్రకారం.. రెడ్‌మి నోట్ 18 5జీ చైనీస్ వేరియంట్ ఏకంగా 8,888mAh బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది. ఇక గ్లోబల్ వేరియంట్‌లో 8,100mAh బ్యాటరీ ఉండొచ్చని సమాచారం.. రెండు వేరియంట్లు కూడా 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. అయితే కంపెనీ దీనిపై ఇంకా రివీల్ చేయలేదు..

Read Also : Realme Narzo 100 Lite 5G : బడ్జెట్‌లో బెస్ట్ 5G ఫోన్.. రూ. 15,999కే రియల్‌మి లైట్ ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు..!

రీబ్రాండెడ్ ఫోనా? :
టిప్‌స్టర్ పేపర్ కింగ్13 వివరాల ప్రకారం.. ఈ ఫోన్ చైనీస్ వేరియంట్‌కు మిస్ట్ అనే కోడ్‌నేమ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మోడల్ నంబర్ M077CEగా అంచనా. అంతేకాదు, రెడ్‌మి నోట్ 18, రెడ్‌మి నోట్ 18 5జీ, పోకో M8 పవర్ 5జీ పేర్లతో ఈ డివైజ్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని లీకులు సూచిస్తున్నాయి. ఈ ఫోన్ రెడ్‌మి నోట్ 17 5జీకి రీబ్రాండెడ్ వెర్షన్ అంటున్నారు. అయితే ముఖ్యమైన మార్పు బ్యాటరీ సామర్థ్యంలోనే ఉంటుందని అంచనా.

50MP కెమెరా.. 10,000mAh బ్యాటరీ :
లీకైన ఫీచర్ల ప్రకారం, ఈ సిరీస్‌లో 50MP మెయిన్ కెమెరా వంటి ఫీచర్లు ఉండొచ్చు.. అలాగే, రెడ్‌మి నోట్ 18 సిరీస్‌లో 3 మోడళ్లు ఉండొచ్చు.. ఇందులో టాప్ మోడల్‌గా రెడ్‌మి నోట్ 18 ప్రో మాక్స్‌లో ఏకంగా 10,000mAh బ్యాటరీ ఉండొచ్చు.. అయితే, ఇవన్నీ ప్రస్తుతానికి లీకులు, అంచనాలు మాత్రమే. ఫోన్ డిజైన్, పూర్తి స్పెసిఫికేషన్లు, ధర, లాంచ్ తేదీపై రెడ్‌మి అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.