OPPO Reno 17 Series : ఒప్పో కొత్త రెనో 17 సిరీస్ ఫోన్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు..!

OPPO Reno 17 Series : ఒప్పో నుంచి రెనో 17 సిరీస్‌ వచ్చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో ట్రిపుల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. ఒప్పో రెనో 17 సిరీస్ ఫీచర్లు, ధర వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

OPPO Reno 17 Series

  • ఒప్పో రెనో 17 సిరీస్, ధర, స్పెసిఫికేషన్లు ఇవే
  • స్టాండర్డ్ మోడల్‌, ఒప్పో రెనో 17 ప్రో కూడా
  • ఒప్పో రెనో 17 ప్రో 200MP ప్రైమరీ కెమెరా సెటప్
  • ఈ స్మార్ట్‌ఫోన్లలో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్

OPPO Reno 17 Series : చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ ఒప్పో నుంచి ఒప్పో రెనో 17 సిరీస్‌ వచ్చేసింది. ఇందులో స్టాండర్డ్ మోడల్‌తో పాటు ఒప్పో రెనో 17 ప్రో కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో ట్రిపుల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. ఒప్పో రెనో 17 ప్రోతో పాటు ఒప్పో ప్యాడ్ ఎయిర్ 6 కూడా రిలీజ్ అయింది. ఒప్పో రెనో 17 సిరీస్ ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి..

ఒప్పో రెనో 17 సిరీస్ ధరలివే :
చైనాలో లాంచ్ అయిన ఒప్పో రెనో 17 ఫోన్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 4,199 (రూ. 59,200), 12GB + 256GB వేరియంట్ కోసం CNY 3,799 (సుమారు రూ. 53,600), 12GB + 512GB వేరియంట్ కోసం CNY 3,999 (సుమారు రూ. 56,400), 12GB + 1TB వేరియంట్ కోసం CNY 4,899 (సుమారు రూ. 69వేలు)గా నిర్ణయించారు.

ఒప్పో రెనో 17 ప్రోలో 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 4,199 (సుమారుగా రూ. 59,200), 12GB + 256GB వేరియంట్ ధర CNY 4,599 (సుమారుగా రూ. 64,800), 12GB + 512GB వేరియంట్ ధర CNY 4,899 (సుమారుగా రూ. 69వేలు)గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు స్నో వైట్, ఐస్ మూన్ వైట్, ఎన్‌కౌంటర్ క్యాట్, స్టార్‌లైట్ పింక్, కోకో బ్రౌన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి.

ఒప్పో రెనో 17 సిరీస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :

ఈ డ్యూయల్-సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 17 ఆధారిత కలర్‌ఓఎస్ 17పై రన్ అవుతాయి. ఒప్పో రెనో 17 ప్రోలో 6.32-అంగుళాల ఫ్లెక్సిబుల్ అమోల్డ్ డిస్‌ప్లే (2,640 x 1,216 పిక్సెల్స్) ఉంది. ఈ ఫోన్ రిఫ్రెష్ రేట్ 120Hz వరకు టాప్ బ్రైట్‌నెస్ 1,800 నిట్స్ అందిస్తుంది.

Read Also : Redmi Note 18 5G Leak : వావ్.. కొత్త రెడ్‌మి నోట్ 18 5G సిరీస్ వస్తోందోచ్.. భారీ బ్యాటరీ అదుర్స్, ఫీచర్లు ముందే లీక్..!

ఈ సిరీస్‌లోని స్టాండర్డ్ మోడల్‌లో 6.56-అంగుళాల ఫ్లెక్సిబుల్ అమోల్డ్ డిస్‌ప్లే (2,624 x 1,208 పిక్సెల్స్) ఉంది. ఒప్పో రెనో 17 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 8550 సూపర్ ప్రాసెసర్‌తో వస్తుంది. ఒప్పో రెనో 17 స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.

ఈ ఒప్పో ఫోన్లలో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. ఒప్పో రెనో 17 ప్రోలో 200MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఒప్పో రెనో 17లో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా 50MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి.

ఈ 2 స్మార్ట్‌ఫోన్‌లలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఒప్పో రెనో 17 ప్రోలో 7,250mAh బ్యాటరీ ఉండగా, ఒప్పో రెనో 17లో 8,000mAh బ్యాటరీ ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 80W వైర్డ్ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి.