Jaydev Unadkat : టీ20 క్రికెట్లో జయదేవ్ ఉనద్కత్ ప్రపంచ రికార్డు.. 11వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మరీ..
Jaydev Unadkat : టీమ్ఇండియా వెటరన్ ఆటగాడు జయదేవ్ ఉనద్కత్ అరుదైన ఘనత సాధించాడు.
- Thota Vamshi Kumar
- Published on- November 27, 2026 / 02:16 PM IST
Jaydev Unadkat highest score at number 11 position in T20 cricket
Jaydev Unadkat : టీమ్ఇండియా వెటరన్ ఆటగాడు జయదేవ్ ఉనద్కత్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతడు ఈ ఘనత సాధించాడు. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర కెప్టెన్ అయిన జయదేవ్ ఉనద్కత్ 26 బంతుల్లో 40 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతడు ఇంగ్లాండ్ బ్యాటర్ డ్యానీ బ్రిగ్స్ (35 పరుగులు) రికార్డును బ్రేక్ చేశాడు.
టీ20 క్రికెట్లో 11వ స్థానంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు వీరే..
* జయదేవ్ ఉనద్కత్ (సౌరాష్ట్ర తరుపున) – 40 పరుగులు
* డ్యానీ బ్రిగ్స్ (అడిలైడ్ స్ట్రైకర్స్ తరుపున) – 35 నాటౌట్
* డ్వేన్ డ్రేక్స్ (సెయింట్ కిట్స్ మరియు నెవిస్ పేట్రియాట్స్ తరుపున) – 34 నాటౌట్
* ఖాలిద్ అహ్మది (బెల్జియం తరుపున) – 31 నాటౌట్
* ముజీబ్ ఉర్ రెహమాన్ (బ్రిస్బేన్ హీట్ తరుపున) – 27 పరుగులు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఆ తరువాత 193 లక్ష్య ఛేదనలో సౌరాష్ట్ర ఘోరంగా తడబడింది. బ్యాటర్లు విఫలం కావడంతో 16.4 ఓవర్లలో 154 పరుగులకే కుప్పకూలింది. అయితే.. ఆఖరి వికెట్‌కు చేతన్ సకారియా (21 నాటౌట్)తో కలిసి జయదేవ్ ఉనద్కత్ ఎదురుదాడికి దిగాడు. వీరిద్దరు పదో వికెట్ కు 62 పరుగులు జోడించినప్పటికి కూడా జట్టును గెలిపించలేకపోయారు.
