Gold Silver Prices Today : బంగారం కొనేవాళ్లకు అలర్ట్.. ఒక్కరోజులోనే భారీ మార్పులు.. నేటి ధరలు ఇవే..

Gold Silver Prices Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ అలెర్ట్. ఇవాళ గోల్డ్ ధరల్లో కీలక మార్పులు చోటు చేసైుకున్నాయి.

1/7
Gold Silver Prices Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ అలర్ట్. గత వారంరోజులుగా గోల్డ్ రేటు తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలో 24 క్యారెట్ల 10గ్రాములు బంగారంపై ఏకంగా రూ. 13వేలకుపైగా తగ్గింది. అయితే, ఇవాళ మాత్రం గోల్డ్ రేటు పెరిగింది.
2/7
సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.1480 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.1,350 పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 73 డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 3,608 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
3/7
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,46,00 వద్ద కొనసాగుతుండగా.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,33,818 వద్ద కొనసాగుతోంది.
4/7
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,46,173 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,33,991 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,46,000కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,33,818 వద్ద కొనసాగుతోంది.
5/7
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.1,75,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.1,75,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.1,75,000 వద్ద కొనసాగుతోంది.
6/7
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.
7/7