Gold Silver Prices Today : వరుసగా ఆరోరోజు తగ్గిన గోల్డ్ రేటు.. ఒక్కసారిగా ఈ మార్పులెందుకు.. కారణాలివే.. వచ్చేవారం కూడా తగ్గుతుందా..?

Gold Silver Prices Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త. గోల్డ్ రేటు వరుసగా ఆరో రోజు తగ్గింది.

1/7
Gold Silver Prices Today : బంగారం కొనుగోళ్లకు సిద్ధమయ్యే వారికి బంపర్ ఆఫర్. వీటి ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. ఆకాశం నుంచి రాకెట్ భూమిపైకి దూసుకొస్తున్నట్లుగా గోల్డ్ రేటు వేగంగా పడిపోతుంది. సోమవారం నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
2/7
శనివారం కూడా బంగారం ధర భారీగా తగ్గింది. దీంతో ఆరు రోజుల్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై సుమారు రూ. 8వేలు తగ్గింది. వచ్చే వారంకూడా గోల్డ్ రేటు తగ్గుదల కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
3/7
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 490 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 450 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గో్ల్డ్ రేటు స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 3,881 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది. అయితే, సోమవారం నుంచి కిలో వెండిపై రూ. 20వేలు తగ్గింది.
4/7
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,44,292 వద్ద కొనసాగుతుండగా.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,32,260 వద్ద కొనసాగుతోంది.
5/7
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,44,465 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,32,433 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,44,292కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,32,260 వద్ద కొనసాగుతోంది.
6/7
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.1,75,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.1,75,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.1,75,000 వద్ద కొనసాగుతోంది.
7/7
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.