CM Yogi Mother Passes Away: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు మాతృవియోగం.. తల్లి సావిత్రి దేవి కన్నుమూత
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(CM Yogi Mother Passes Away) తల్లి సావిత్రి దేవి (91) అనారోగ్యంతో ఉత్తరాఖండ్‌లోని తమ స్వగ్రామంలో కన్నుమూశారు.
- V Santhosh Kumar
- Published on- November 20, 2026 / 01:44 PM IST
Uttar pradesh cm yogi adityanath mother savitri devi passes away
CM Yogi Mother Passes Away: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి సావిత్రి దేవి (91) వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరీ గర్వాల్ జిల్లా పంచూర్ గ్రామంలోని తమ పూర్వీకుల నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్న ఆమె పరిస్థితి శుక్రవారం ఉదయం ఒక్కసారిగా విషమించడంతో వైద్యులు ఇంటికి వచ్చి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయిందని సీఎం సోదరుడు మహేంద్ర అధికారికంగా ధ్రువీకరించారు.
Avinash Reddy Arrest: కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్.. పులివెందుల నామినేషన్లలో తీవ్ర ఉద్రిక్తత
అంత్యక్రియల ఏర్పాట్లు.. ప్రముఖుల సంతాపం:
సావిత్రి దేవి మరణవార్త తెలిసిన సమయంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Mother Passes Away)గోరఖ్‌పూర్‌లో విద్యార్థులకు ట్యాబ్లెట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తల్లి మరణవార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన ఆయన తన పర్యటనను ముగించుకుని ఉత్తరాఖండ్‌కు బయలుదేరనున్నారు. శనివారం హరిద్వార్‌లో ఆమె అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉందని పౌరీ గర్వాల్ ఎస్పీ సర్వేష్ పన్వర్ తెలిపారు. యోగి ఆదిత్యనాథ్ మాతృవియోగం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, మంత్రులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
