Sanjay Dutt : గత జన్మ జ్ఞాపకాలు పంచుకున్న సంజయ్ దత్.. అశోక రాజ్యంలో రాజు.. భార్య, మంత్రి మోసం చేయడంతో..
ఆయన గత జన్మలో ఏం జరిగిందో చెప్పడంతో సంజయ్ దత్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. (Sanjay Dutt)
- Saketh U
- Published on- November 19, 2026 / 11:16 AM IST
sanjay dutt
Sanjay Dutt : అప్పుడప్పుడు కొంతమంది గత జన్మ జ్ఞాపకాలు అని మాట్లాడుతుంటారు. వీటిని పలువురు నమ్ముతారు. పలువురు కొట్టిపారేస్తారు. ఇటీవల బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో, నటుడు సంజయ్ దత్ తన గత జన్మ గురించి పంచుకున్నాడు. ఆయన గత జన్మలో ఏం జరిగిందో చెప్పడంతో సంజయ్ దత్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
సంజయ్ దత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బొటనవేలు ముద్రలు, చేతితో రాసిన పత్రాల ద్వారా గతజన్మల వివరాలను చెప్పే ఒక గ్రామం ఉందని, అక్కడ ఒక పూజరిని కలవమని నా స్నేహితుడు చెప్పాడు. అతను చెప్పినట్టు నేను వెళ్లి కలిస్తే నా గత జన్మ గురించి చెప్పాడు ఆ పూజారి. నేను గత జన్మలో అశోక రాజ్యంలో ఒక రాజు. నా భార్య, మంత్రి నన్ను మోసం చేసారు. నా భార్య మంత్రితో వివాహేతర పెట్టుకుంది. నేను చనిపోవాలని నా భార్య నన్ను యుద్దానికి పంపింది. కానీ నేను యుద్ధంలో గెలిచి వచ్చాక వాళ్ళిద్దరి గురించి తెలిసి వాళ్ళను చంపేసాను. చివరి దశలో శివ భక్తుడిగా అడవిలో ఆమరణ నిరాహార దీక్ష చేసి మరణించానని ఆ పూజారి తెలిపాడు.
Also Read : Samyuktha : రంగస్థలంపై నవరసాలను పలికించిన హీరోయిన్.. సంయుక్త ఫొటోలు వైరల్..
అలాగే.. ప్రస్తుతం నా లైఫ్ లో జరిగిన సంఘటనలకు గత జన్మని ముడి పెట్టి నేను మంచి కుటుంబంలో పుట్టి పేరు, ప్రఖ్యాతలు తెచ్చుకున్నా గత జన్మలో చేసిన ఆ రెండు హత్యల వల్లే కర్మ అనుభవిస్తున్నాను అని ఆ పూజారి చెప్పినట్టు తెలిపాడు. దీంతో సంజయ్ దత్ తన గత జన్మ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే ఆ గ్రామం ఎక్కడ ఉంది, పూజారి ఎవరు అనే విషయాలు మాత్రం చెప్పలేదు.
