Sampath Nandi : పవన్ కళ్యాణ్ తో విభేదాలపై స్పందించిన డైరెక్టర్.. ఆ సినిమా నుంచి తప్పుకోడానికి కారణం..
సంపత్ నంది పవన్ కళ్యాణ్ సినిమా నుంచి తప్పుకోవడంపై స్పందించాడు. (Sampath Nandi)
Sampath Nandi
Sampath Nandi : గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా డైరెక్షన్ చేసే ఛాన్స్ సంపత్ నందికి వచ్చింది. సంపత్ నంది – పవన్ కళ్యాణ్ కాంబోలోనే ఈ సినిమా మొదలయింది. కానీ తర్వాత సంపత్ నంది ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం, డైరెక్టర్ బాబీ ఎంటర్ అవ్వడం జరిగాయి. దాంతో సంపత్ నంది – పవన్ కళ్యాణ్ మధ్య విబేధాలు వచ్చాయని, రీమేక్ కథ ఏమో అందుకే సంపత్ తప్పుకున్నాడు అని వార్తలు వచ్చాయి.
డైరెక్టర్ సంపత్ నంది ఇపుడు శర్వానంద్ భోగి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ 27 రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సంపత్ నంది పవన్ కళ్యాణ్ సినిమా నుంచి తప్పుకోవడంపై స్పందించాడు.
Also Read : Vrushakarma Trailer : నాగ చైతన్య ‘వృషకర్మ’ ట్రైలర్ వచ్చేసింది..
సంపత్ నంది మాట్లాడుతూ.. నేనే మొదట ఆ సినిమాకు డైరెక్టర్. అప్పుడు పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు, వేరే కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ ఆలస్యమయింది. ఆ సినిమా మరింత లేట్ గా మొదలవుతుందని తెలిసి ఒకరోజు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా నన్ను పిలిచి మాట్లాడారు. సినిమా మొదలవ్వడానికి కొంత సమయం పట్టేలా ఉంది. అప్పటివరకు వెయిట్ చేయగలరా అని నన్ను అడిగారు. దాంతో నేను ఆ గ్యాప్‌లో ఇంకో సినిమా చేసుకుంటాను మీకేమైనా అభ్యంతరం ఉందా సర్ అని అడిగాను. దాంతో ఆయన ఏం లేదు చేసుకోండి అన్నారు. కేవలం షూటింగ్ ఆలస్యం అవ్వడం, ఆ గ్యాప్ వృథా చేసుకోకుండా ఇంకో సినిమా చేయాలనే కారణంతోనే నేను ఆ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చాను.
నేను పవన్ కళ్యాణ్ గారితో చేయాల్సింది ఏ రీమేక్ కథ కాదు. ఒరిజినల్ కథతోనే తీసిన సర్దార్ గబ్బర్ సింగ్. ఆ సినిమా నుంచి తప్పుకున్న తర్వాత నాతో సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ చివరి వరకు ప్రయత్నించారని నిర్మాతలు కూడా చెప్పారు. కానీ ఒక డైరెక్టర్ కెరీర్‌ను దృష్టిలో పెట్టుకొని తన కోసం ఎక్కువ కాలం ఎదురుచూసేలా చేయడం పవన్‌కు నచ్చదు. ఆ కారణాలతోనే ఆ సినిమా నుంచి బయటకు వచ్చాను లేకపోతే ఆ సినిమా నేనే చేసేవాడ్ని. పవన్ తో కలిసి ఆ సినిమా కోసం పనిచేసిన కొద్ది కాలం నా జీవితంలో ఒక మధుర జ్ఞాపకం అని అన్నారు.
