Sai Pallavi : షార్ట్ హెయిర్ తో, ప్రగ్నెన్సీతో.. సాయి పల్లవి ఇలా మారిపోయింది ఏంటి.. సాంగ్ వైరల్..

ప్రేక్షకులు తేరుకునేలోపే మరింత షార్ట్ హెయిర్, బేబీ బంప్ తో షాక్ ఇచ్చింది సాయి పల్లవి. (Sai Pallavi)

  • Published on- November 26, 2026 / 09:57 AM IST

Sai Pallavi

Sai Pallavi : ఇటీవల ధనుష్ ఓం సినిమాలో సాయి పల్లవి షార్ట్ హెయిర్ తో పోలీస్ ఆఫీసర్ గా కనిపించి, యాక్షన్స్ చేసి కొత్త లుక్స్ లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ ఆశ్చర్యం నుంచి ఫ్యాన్స్, ప్రేక్షకులు తేరుకునేలోపే మరింత షార్ట్ హెయిర్, బేబీ బంప్ తో షాక్ ఇచ్చింది సాయి పల్లవి.

డైరెక్టర్‌ మణిరత్నం దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి, సాయిపల్లవి జంటగా ఇంజి వెల్లమ్‌ అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా 2027 జనవరి 29న రిలీజ్ కానుంది. మణిరత్నం పాత స్టైల్ లో మంచి లవ్ స్టోరీగా ఈ సినిమా అందబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, లీకైన వీడియోలతో ఇదేదో క్యూట్ లవ్ స్టోరీ అని అంచనాలు నెలకొన్నాయి.

Also Read : Not A Mahatma : ‘నాట్ ఏ మహాత్మా’.. కేసీఆర్ తెలంగాణ దీక్షపై AI వెబ్ సిరీస్.. ట్రైలర్ చూశారా..? డైరెక్టర్ ఎవరో తెలుసా?

తాజాగా ఈ సినిమా నుంచి ఆచి ఆచి.. అనే సాంగ్ ని విడుదల చేసారు. కేవలం తమిళ్ లోనే ఈ పాటని విడుదల చేసారు. అయితే ఈ పాటలో సాయి పల్లవి చాలా షార్ట్ హెయిర్ తో, ప్రగ్నెన్సీ ఉన్న మహిళగా డ్యాన్సులు వేసి ఆకట్టుకుంది. దీంతో సాయి పల్లవి కొత్త లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్, ప్రేక్షకులు. మరి ఈ సినిమాలో సాయి పల్లవి ఎంత కొత్తగా అకనిపిస్తుందో చూడాలి. మీరు కూడా సాయి పల్లవి కొత్త లుక్స్ తో వచ్చిన సాంగ్ చూసేయండి..