Ramya Krishnan : రమ్యకృష్ణ మొదటి సంపాదన ఎంతో తెలుసా? సినిమాల్లోకి రాకముందు..

తాజాగా రమ్యకృష్ణ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన మొదటి సంపాదన గురించి తెలిపింది. (Ramya Krishnan)

  • Published on- November 17, 2026 / 04:35 PM IST

Ramya Krishnan

Ramya Krishnan : ఎన్నో ఐకానిక్ పాత్రలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రమ్యకృష్ణ. 14 ఏళ్లకే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి గ్లామరస్ పాత్రలతో పాటు డివోషనల్ పాత్రల్లోనూ తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. బాహుబలి నుంచి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది రమ్యకృష్ణ. తాజాగా రమ్యకృష్ణ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన మొదటి సంపాదన గురించి తెలిపింది.

Also See : Genelia Deshmukh : ఇదేం ఫ్యాషన్ జెనీలియా.. చెవి కమ్మలుగా 5 పైసల కాయిన్స్.. కానీ..

రమ్యకృష్ణ మాట్లాడుతూ.. నేను డ్యాన్సర్ ని. కూచిపూడి నేర్చుకునేదాన్ని. వెంపటి చిన సత్యంగారు మా గురువు. రోజూ స్కూల్ అవ్వగానే డ్యాన్స్ క్లాస్ కి వెళ్లేదాన్ని. రోజూ స్కూల్ నుంచి స్కూల్ డ్రెస్ తోనే వెళ్లేదాన్ని. ఒకరోజు అనుకోకుండా సల్వార్ కమీజ్ వేసుకొని వెళ్ళాను. ఆ రోజు ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కి డ్యాన్సర్లు కావాలని నన్ను కూడా సెలెక్ట్ చేసారు. సల్వార్ కమీజ్ లో చూసి పెద్ద అమ్మాయిని అనుకోని సెలెక్ట్ చేసారు. తర్వాత స్కూల్ డ్రెస్ లో చూసి వద్దన్నారు. కానీ నేను చేస్తాను అని అడుక్కున్నాను. ఇదంతా 8వ తరగతిలో జరిగింది.

ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కి వంద రూపాయలు ఇచ్చారు. అదే నా మొదటి సంపాదన. అప్పట్లో ఆ డబ్బులు ఎక్కువే. ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఫోటోలు చూసి భారతి రాజా, టి రాజేందర్ చూసి నన్ను ఆడిషన్ చేసి సినిమాలు ఆఫర్ చేసారు. కానీ ఆ రెండు చేయకుండా ఒక కమెడియన్ తో సినిమా చేశా. అలా 14 ఏళ్లకే హీరోయిన్ అయ్యాను. స్కూల్ లో హోమ్ వర్క్, ఎగ్జామ్స్ తప్పించుకోవచ్చు అని యాక్టింగ్ వైపు వెళ్తాను అని చెప్పాను మొదట్లో అని తెలిపింది.