Not A Mahatma : ‘నాట్ ఏ మహాత్మా’.. కేసీఆర్ తెలంగాణ దీక్షపై AI వెబ్ సిరీస్.. ట్రైలర్ చూశారా..? డైరెక్టర్ ఎవరో తెలుసా?

మీరు కూడా నాట్ ఏ మహాత్మా ట్రైలర్ చూసేయండి.. (Not A Mahatma)

  • Published on- November 26, 2026 / 09:12 AM IST

Not A Mahatma

Not A Mahatma : ఇటీవల గతంలో జరిగిన సంఘటనలు, పలువురు ప్రముఖుల జీవిత కథలతో సినిమాలు వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా కేసీఆర్ బయోపిక్ వస్తుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం 2009 లో కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్షపై వెబ్ సిరీస్ వస్తుంది. అయితే ఇది AI వెబ్ సిరీస్ గా రూపొందుతున్నట్టు తెలుస్తుంది.

అనగనగా ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌పై పట్టాభి ఆర్. చిలుకూరి నిర్మాణంలో ‘ఓయ్’ సినిమా డైరెక్టర్ ఆనంద్ రంగ దర్శకత్వంలో ఈ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్‌ని నాట్ ఎ మహాత్మా అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. AI ని వాడి, కొన్ని రియల్ విజువల్స్ తో ఈ సిరీస్ ని నాలుగు ఎపిసోడ్స్ గా తీస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా నాట్ ఏ మహాత్మా ట్రైలర్ చూసేయండి..

Also Read : Anitha Vangalapudi : ఆకాశంలో ఒక తార సినిమాపై ఏపీ హోం మంత్రి రివ్యూ.. ఒక ఆడపిల్ల కలలకు నమ్మకం తోడైతే..

ఈ ట్రైలర్ లో.. విద్యార్థులు, ఉద్యోగులు, ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్టు, కేసీఆర్ దీక్ష చేస్తున్నట్టు, అప్పటి కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం.. లాంటి ఘటనలు చూపించారు. అయితే చివర్లో.. కేసీఆర్ నిజంగానే ఫాస్టింగ్ చేస్తుంటాడంటావా అని ఒకరు ప్రశ్నిస్తే, చాలా కాన్‌స్పిరసీ థియరీస్ ఉన్నాయ్ అని మరొకరు చెప్పడం, అది రికార్డింగ్ లో ఉండటంతో.. హేయ్.. కెమెరా కట్ చెయ్ అని ఇంకొకరు అనడంతో ఈ ట్రైలర్ వైరల్ గా మారింది. దీంతో ఈ సిరీస్ లో ఏం చూపిస్తారో అనే ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ సిరీస్ రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.