Jani Master : ఢీ షోలో జానీ మాస్టర్ కూతురు.. అందరిలో డాడీ అని పిలవొద్దంటాడు.. మాస్టర్ పై ఆలియా కామెంట్స్..
దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. (Jani Master)
- Saketh U
- Published on- November 23, 2026 / 09:24 AM IST
Jani Master
Jani Master : స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఓ పక్క సినిమాలకు డ్యాన్స్ కొరియోగ్రాఫ్ చేస్తూనే పలు టీవీ షోలలో కనిపిస్తారు. ప్రస్తుతం జానీ మాస్టర్ ఢీ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఢీ షో ఫైనల్ ఎపిసోడ్ కి జానీ మాస్టర్ కూతురు అలియా వచ్చింది.
అలియా షోకి వచ్చి ప్రదీప్ తో, ఆదితో కాసేపు కామెడీ చేసి పంచులు వేసింది. అనంతరం జానీ మాస్టర్, అలియా కలిసి స్టేజిపైన స్టెప్పులు వేశారు. అలాగే జానీ మాస్టర్ ప్లేస్ లో కూర్చొని తను జడ్జిగా ఎలా చేస్తారో చేసి అందర్నీ నవ్వించింది. ఈ క్రమంలో జానీ మాస్టర్ గురించి చెప్తూ.. బయట ఐమాక్స్ కి, ఎక్కడైనా వెళ్తే జనాలు ఉంటే డాడీ అని పిలవద్దు అని చెప్తారు. జానీ మాస్టర్ అని పిలవమంటారు అని ఆసక్తికర విషయం తెలిపింది.
Also Read : Ananya Sharma : దేవుడి మీద నమ్మకం లేదు.. పూజ చేస్తే ఏదో మారిపోతుందని నమ్మను.. అనన్య శర్మ కామెంట్స్ వైరల్..
తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. మరి జానీ మాస్టర్ గురించి అలియా ఇంకేం మాట్లాడిందో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.
