Tollywood : మేనేజర్ల మైండ్ గేమ్.. నిర్మాతలకే సవాల్.!

Tollywood : టాలీవుడ్‌లో నిర్మాతలు, హీరో మేనేజర్ల మధ్య తెరవెనుక మరో రకమైన ఆట సాగుతోందనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

Gossip Garage Managers mind games a challenge for the producers themselves in Tollywood

Tollywood : టాలీవుడ్‌లో నిర్మాతలు, హీరో మేనేజర్ల మధ్య తెరవెనుక మరో రకమైన ఆట సాగుతోందనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సినిమా నిర్మాణం కోసం కోట్లు పెట్టుబడి పెట్టే కొందరు నిర్మాతలకు, హీరోల మేనేజర్ల వ్యవహారశైలి తలనొప్పిగా మారుతోందనే టాక్ నడుస్తోంది.

కమీషన్లు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు మేనేజర్లు నిర్మాతల మధ్య చిచ్చుపెడుతూ, ఇప్పటికే చర్చలు జరుపుతున్న ప్రాజెక్టులను మరో నిర్మాత చేతుల్లోకి వెళ్లేలా తెరవెనుక పావులు కదుపుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

హీరోల డేట్స్, కథల ఎంపిక, రెమ్యునరేషన్, ప్రాజెక్టుల ఒప్పందాల విషయంలో మేనేజర్ల పాత్ర కీలకంగా మారడంతో కొందరు నిర్మాతలు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారట. ఒక నిర్మాతతో సినిమా ఓకే అయినట్టు సంకేతాలు ఇచ్చి, మరోవైపు ఎక్కువ కమీషన్ లేదా ఇతర ప్రయోజనాలు వచ్చే అవకాశం ఉన్నవైపు ప్రాజెక్టును మళ్లిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

అసలు సినిమా చేయాల్సిన హీరోకు, పెట్టుబడి పెట్టాల్సిన నిర్మాతకు మధ్య మేనేజర్లే నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారా.? కమీషన్ల కోసం నిర్మాతల కలలను పణంగా పెడుతున్నారా.? అన్న చర్చ టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.