Parmesh Renukuntla : ఈ సినిమా చూసి లవర్స్ మధ్య గొడవలు వస్తే మాకు సంబంధం లేదు.. అమ్మాయిలపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..
తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ జరగ్గా దర్శకుడు పరమేష్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. (Parmesh Renukuntla)
- Saketh U
- Published on- November 26, 2026 / 08:15 AM IST
I Hate Marriage
Parmesh Renukuntla : ఇటీవల సమాజంలో జరిగే పలు సంఘటనలని సినిమాలుగా తీస్తున్నారు. అలా ప్రస్తుతం లవ్, రిలేషన్స్ విషయంలో జరుగుతున్న కొన్ని సంఘటనల ఆధారంగా ఐ హేట్ మ్యారేజ్ అనే సినిమా తెరకెక్కింది. ఇటీవల రిలీజ్ అయిన ఈ ట్రైలర్. ట్రైలర్ లోని బోల్డ్ డైలాగ్స్ వైరల్ అయ్యాయి. ఈ సినిమా నవంబర్ 27న రిలీజ్ కానుంది.
తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ జరగ్గా దర్శకుడు పరమేష్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Also See : Pavithra Puri : పూరి జగన్నాధ్ కూతురు పవిత్ర క్యూట్ సెల్ఫీలు..
దర్శకుడు పరమేష్ మాట్లాడుతూ.. చాలా మంది అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. డేటింగ్, లవ్, రిలేషన్ అని ఉంటారు. కానీ చివరకు పెళ్లి మాత్రం పేరెంట్స్ చూపించిన అబ్బాయినే చేసుకుంటున్నారు. చాలా మంది అమ్మాయిలు ఇలాగే ఉన్నారు. ప్రేమించిన అబ్బాయి కోసం ఇంట్లో ఫైట్ చెయ్యట్లేదు అమ్మాయిలు. అలాంటి పాయింట్ నుంచి వచ్చిన కథ ఇది. అందుకే ట్రైలర్ లో ఆ డైలాగ్ పెట్టాను. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కరెక్ట్ కదా, మనం చూసే వాళ్ళు ఇలాగే ఉన్నారు కదా అని అనుకుంటారు. ఈ సినిమా చూసిన తర్వాత లవర్స్ మధ్య ఏదైనా గొడవలు అయితే మాకు సంబంధం లేదు. అలాంటి కంటెంట్ ఈ సినిమాలో చూడబోతున్నారు అని అన్నారు.
ఐ హేట్ మ్యారేజ్ ట్రైలర్..
