Ananya Sharma : దేవుడి మీద నమ్మకం లేదు.. పూజ చేస్తే ఏదో మారిపోతుందని నమ్మను.. అనన్య శర్మ కామెంట్స్ వైరల్..
30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ తో ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చుకుంది అనన్య శర్మ. (Ananya Sharma)
- Saketh U
- Published on- November 23, 2026 / 09:08 AM IST
Ananya Sharma
Ananya Sharma : 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ తో ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చుకుంది అనన్య శర్మ. ఆ సిరీస్ తర్వాత పలు సినిమాలు, సిరీస్ లు చేస్తూ బిజీగానే ఉంది. నవంబర్ 27న హై అనే సినిమాతో రాబోతుంది. ఈ సినిమాలో అనన్య మెయిన్ లీడ్ లో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనన్య ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అనేక ఆసక్తికర విషయాలు తెలిపింది.
ఈ క్రమంలో తనకు దేవుడి మీద నమ్మకం లేదంటూ దైవం, భక్తి మీద కామెంట్స్ చేసింది.
Also See : Ramya Pasupuleti : అమ్మ చీర కట్టుకొని.. పెళ్ళిలో సందడి చేసిన హీరోయిన్..
అనన్య శర్మ మాట్లాడుతూ.. నాకు దేవుడి మీద నమ్మకం లేదు. అలా అని లేదు అని చెప్పను. నేను న్యూట్రల్ పర్సన్. నేను పూజలు చేయను. గుడికి వెళ్లి పూజలు చేయడం లాంటివి ఉండదు. పూజ చేస్తే ఏదో మారిపోతుంది అనే నమ్మకం నాకు లేదు. నేను నమ్మను. కానీ వేరే వాళ్ళు పూజలు చేస్తే వాళ్ళతో కూర్చుంటాను. రామాయణం, కృష్ణుడు ఇవన్నీ మైథలాజి అంటారు నేను అది హిస్టరీ అని నమ్ముతాను. నాకు సమస్యలు వస్తే ఎందుకు వచ్చాయి అనుకుంటాను కానీ దేవుడు ఎందుకు ఇలా ఇచ్చాడు అని అనుకోను నేను దేవుడ్ని నమ్మను కాబట్టి. కానీ వేరే వాళ్ళ నమ్మకాన్ని నమ్ముతాను. వాళ్ళ నమ్మకం మీద రెస్పెక్ట్ ఉంది. నేను చూడంది వాళ్ళు చూశారేమో. నాకు ఏజ్ పెరిగాక నమ్మకం వస్తుందేమో ఇప్పటికైతే నమ్మకం లేదు అని తెలిపింది.
