The Breaking News : అనన్య నాగళ్ళ, మురళీ మోహన్ ‘ది బ్రేకింగ్ న్యూస్’.. రిలీజ్ ఎప్పుడంటే..

తప్పుడు న్యూస్ వల్ల జరిగే అనర్ధాల నేపథ్యంలో ఈ సినిమాని సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. (The Breaking News)

  • Published on- November 23, 2026 / 03:17 PM IST

The Breaking News

The Breaking News : మురళీ మోహన్, అనన్య నాగళ్ల ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ది బ్రేకింగ్ న్యూస్. ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్‌పై హనుమంత రెడ్డి, ఉమా గుటూర్ నిర్మాణంలో పవన్ కడియాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సోనియా నాయుడు, ఆర్.కె. నాయుడు, వాసుదేవ్, ప్రేమ్ కృష్ణ, రవి ప్రకాష్, వాహిని.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.

మీడియా రంగం, బ్రేకింగ్ న్యూస్, తప్పుడు న్యూస్ వల్ల జరిగే అనర్ధాల నేపథ్యంలో ఈ సినిమాని సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని సుమంత్ విడుదల చేశారు. మీడియా బ్యాక్ డ్రాప్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ది బ్రేకింగ్ న్యూస్ సినిమా డిసెంబర్ 11న థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది.

Also Read : Ananya Sharma : అల్లు అర్జున్ నా ఫేవరేట్ హీరో కానీ.. అలా చేయడం కరెక్ట్ కాదు.. ఆర్య 2 సినిమాపై అనన్య కామెంట్స్..