Srinath Maganti : యాక్టర్ ని మార్చినా పాత్ర మాత్రం పర్ఫెక్ట్ పేలింది.. ట్రోల్స్‌కి నటనతోనే కౌంటర్ ఇచ్చి హిట్ కొట్టిన నటుడు..
మొదటి పార్ట్ లో నటించిన సాయి సుశాంత్ తప్పుకోవడంతో ENE రిపీట్ లో ఆయన పాత్రకి నటుడు శ్రీనాథ్ మాగంటిని తీసుకున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- November 22, 2026 / 03:34 PM IST
Actor who hit back at trolls through his acting and delivered a hit
Srinath Maganti : తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఈ నగరానికి ఏమైంది సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ENE రిపీట్ సినిమా మొదటి రోజు నుంచే హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా మూడు రోజుల్లోనే 30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి అదరగొట్టింది. అయితే ఈ సినిమా మొదటి పార్ట్ లో నటించిన సాయి సుశాంత్ తప్పుకోవడంతో ENE రిపీట్ లో ఆయన పాత్రకి నటుడు శ్రీనాథ్ మాగంటిని తీసుకున్నారు.
‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ లో శ్రీనాథ్ మాగంటిని తీసుకున్నప్పుడు పలువురు విమర్శలు చేసారు. దీనిపై శ్రీనాథ్ కూడా గతంలో స్పందిస్తూ ఎందుకు ట్రోల్ చేస్తున్నారో తెలీదు కానీ నా పాత్రతో మెప్పిస్తాను అని తెలిపాడు. చెప్పినట్టే విమర్శలకు, ట్రోల్స్‌కు తన నటనతో కౌంటర్ ఇచ్చాడు శ్రీనాథ్. ఈ సినిమాలో కార్తీక్ పాత్రలో సినిమాటోగ్రాఫర్ గా తన నటనతో మెప్పించాడు. తాగి హీరోయిన్ ఇంట్లో గొడవ చేసే సీన్ లో అయితే అతని పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఫుల్ గా నవ్వించాడు.
Ashwini Sree : గోవాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న బిగ్‌బాస్ భామ.. ఫోటోలు వైరల్..
ఇక శివాత్మికతో పెయిర్ గా చేయగా తనతో ఉన్న లవ్ సీన్స్ లో కూడా చాలా బాగా మెప్పించాడు. ఈ సినిమాలోనే తన పాత్రలో కామెడీ, బాధ, కోపం.. ఇలా డిఫరెంట్ ఎమోషన్స్ ని చూపించి ఆ పాత్రకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడని నిరూపించుకున్నాడు. శ్రీనాథ్ ని లక్కీ భాస్కర్ సమయంలోనే త్రివిక్రమ్ స్టేజిపై తన నటనను పొగిడారు. ఈ సినిమా తర్వాత మరోసారి తన నటనతో అందర్నీ మెప్పించిన శ్రీనాథ్ కి మున్ముందు మరిన్ని అవకాశాలు రావడం ఖాయం.
