Bisleri Water Scare : బాటిల్ వాటర్ తాగుతున్నారా? తాగే నీళ్లలో ప్రమాదకర రసాయనాలు.. క్యాన్సర్ ముప్పు ఉందా?
Bisleri Water Scare : బిస్లెరి ప్యాకేజ్డ్ వాటర్ శాంపిల్‌లో బ్రోమేట్, PAHs ఉన్నట్లు పరీక్షల్లో తేలడంతో కలకలం రేగింది. ఈ ప్రమాదకర రసాయనాలు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? బాటిల్ వాటర్ తాగేవారు ఏయే విషయాలు తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Updated on- November 23, 2026 / 07:27 PM IST
Bisleri Water Scare
- బిస్లెరి వాటర్‌లో ప్రమాదకర రసాయనాలు..
- దాహం తీర్చే నీళ్లే అనారోగ్యానికి కారణమైతే?
- ప్యాకేజ్డ్ వాటర్‌లో క్యాన్సర్ కారకాలు?
Bisleri Water Scare : ప్యాకేజ్డ్ వాటర్ తాగుతున్నారా? వాటర్ బాటిల్ కొని తాగే ముందు ఓసారి ఆలోచించండి.. మన ఆరోగ్యం కోసం రోజూ తాగే నీళ్ల విషయంలో కూడా జాగ్రత్త అవసరమా? అంటే అవుననే ప్రశ్న ఇప్పుడు తెరపైకి వచ్చింది.
ప్రముఖ ప్యాకేజ్డ్ వాటర్ బ్రాండ్ బిస్లెరి శాంపిల్‌లో ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు (FSSAI) పరీక్షల్లో తేలడంతో ఈ చర్చ మొదలైంది. ముఖ్యంగా బ్రోమేట్, పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) అనే రసాయనాల పేర్లు వినిపించడంతో మరింత ఆందోళన కలిగిస్తోంది..
అసలు బ్రోమేట్ వల్ల ఏమౌతుంది? :
నీటిని శుద్ధి చేసేందుకు ఓజోన్ ప్రక్రియను వాడితే బ్రోమేట్ అనే రసాయనం ఏర్పడుతుంది. ఈ రసాయనానికి ఎక్కువ కాలం గురైతే క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిస్తోంది. జంతువులపై చేసిన పరిశోధనల్లో కిడ్నీలు, థైరాయిడ్ వంటి అవయవాల్లో కణితులు ఏర్పడినట్లు గుర్తించారు. అంతేకాదు, కణాల్లోని డీఎన్ఏ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది.
Read Also : WhatsApp Web Users : వాట్సాప్ వెబ్ వాడుతున్నారా? ఈ ఒక్క పొరపాటుతో మీ ప్రైవసీ డేంజర్‌లో..
PAHsతోనూ సమస్యేనా? :
PAHs అనేవి ఒకటి కాదు.. వందకు పైగా రసాయనాల సమూహం. బొగ్గు, పెట్రోలియం, కలప వంటి పదార్థాలు పూర్తిగా మండనప్పుడు ఇవి ఏర్పడతాయి. వీటిలో కొన్ని క్యాన్సర్‌కు కారణమయ్యే లక్షణాలు ఉంటాయి. శరీరంలోకి చేరినప్పుడు డీఎన్ఏపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయితే, అన్ని (PAHs) ప్రమాదకరమైనవి కావు. ఏ రసాయనం ఎంత మోతాదులో ఉందన్నది ముఖ్యం..
బిస్లెరి ఏం చెప్పిందంటే? :
గోవా ప్లాంట్‌లో సేకరించిన శాంపిల్‌లో బ్రోమేట్ 12µg/L ఉన్నట్లు తొలుత పరీక్షల్లో తేలిందని కంపెనీ తెలిపింది. ఇది నిర్దేశిత 10µg/L లిమిట్ కన్నా ఎక్కువ. అయితే, తదుపరి రిఫరల్ ల్యాబ్, స్వతంత్ర పరీక్షల్లో పరిమితుల్లోనే ఉన్నట్లు వెల్లడించిందని కంపెనీ పేర్కొంది.
అయితే, గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే.. నీళ్ల విషయంలో నాణ్యతే ముఖ్యం. బాటిల్‌పై ఉన్న బ్రాండ్ చూసి మాత్రమే నమ్మకుండా, క్వాలిటీ ప్రమాణాలు, తయారీ వివరాలు కూడా తప్పక తెలుసుకోండి..
