UPI Charges: యూపీఐ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్.. MDR ఛార్జీల అమలు ఇప్పట్లో లేనట్టే? వ్యాపారులకు భారీ ఊరట!

యూపీఐ(UPI Charges) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీల అమలును 2027లో జరుగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాతకు కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసే అవకాశం ఉంది.

Upi transactions mdr charges likely to be deferred till 2027 assembly elections

UPI Charges: దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల విప్లవం కొనసాగుతున్న వేళ, సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు అందరూ నిత్యం ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌లను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే, ఇటీవల యూపీఐ(UPI Charges) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలు విధించాలనే ప్రతిపాదనపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తాజా నివేదికల ప్రకారం, ఎంపిక చేసిన యూపీఐ చెల్లింపులపై ఈ ఎండీఆర్ ఛార్జీల అమలును కేంద్ర ప్రభుత్వం 2027 ప్రథమార్ధంలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాతకు వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నికల వేళ వ్యాపార, వర్తక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావచ్చనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం దిశగా ఆలోచిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Cyclone Aquan: ఉత్తరాంధ్ర తీరం వైపు తీవ్ర ‘అక్వాన్’ తుపాను.. రానున్న 36 గంటలు అత్యంత కీలకం.. 70 కి.మీ. వేగంతో ఈదురుగాలులు, ఈ జిల్లాలకు హై అలర్ట్!

సామాన్యులకు ఊరట.. ఎండీఆర్ ఛార్జీలు ఎవరికి వర్తిస్తాయంటే:

ఈ ప్రతిపాదిత ఛార్జీలపై సాధారణ వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎండీఆర్ అంటే కస్టమర్లు డిజిటల్ చెల్లింపులు చేసినప్పుడు, ఆ లావాదేవీని ప్రాసెస్ చేసే బ్యాంకులు, పేమెంట్ సంస్థలకు వ్యాపారులు చెల్లించే సర్వీస్ ఛార్జీ. అంటే, సామాన్య ప్రజలు ఒకరికొకరు పంపే డబ్బులపై గానీ, సాధారణ కస్టమర్లపై గానీ ఎలాంటి అదనపు భారం ఉండదు. కొత్త విధానం ప్రకారం, నిర్దిష్ట నిబంధనలకు లోబడి రూ.2,000 కంటే ఎక్కువ విలువైన ‘వ్యక్తి నుంచి వ్యాపారికి’ (P2M) జరిగే యూపీఐ చెల్లింపులపై మాత్రమే వ్యాపారులకు 0.4 శాతం ఎండీఆర్ వర్తించనుంది.

లావాదేవీలపై గరిష్ఠ పరిమితి.. ఆర్బీఐ తుది నిర్ణయమే కీలకం:

వ్యాపారులపై భారం మరీ ఎక్కువగా పడకుండా ఉండేందుకు ఈ ఛార్జీలకు కేంద్రం కొన్ని పరిమితులను కూడా ప్రతిపాదించింది. దీని ప్రకారం, రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన పెద్ద లావాదేవీలకు గరిష్ఠంగా రూ.300 మాత్రమే సర్వీస్ ఛార్జీగా వసూలు చేయనున్నారు. అయితే, ఈ కొత్త నిబంధనల తుది అమలు తేదీపై కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇంకా అధికారిక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.