Top Small Family Cars : తక్కువ బడ్జెట్లో మంచి ఫ్యామిలీ కారు.. రూ.10 లక్షల లోపు అదిరిపోయే 5 బెస్ట్ కార్లు!
Top Small Family Cars : రూ.10 లక్షల లోపు ఫ్యామిలీ కారు కొనాలని చూస్తున్నారా? టాటా పంచ్, మారుతి ఫ్రాంక్స్, హ్యుందాయ్ ఎక్స్టర్, స్విఫ్ట్, బ్రెజ్జా కార్ల ధరలు, ఇంజిన్ ఆప్షన్లు, ఫీచర్ల వివరాలు తెలుసుకోండి.
- Sreehari A
- Published on- November 19, 2026 / 04:35 PM IST
Top Small Family Cars in India
- హ్యాచ్‌బ్యాక్ కావాలా? SUV కావాలా?
- రూ.10 లక్షల లోపు మీకోసం 5 కార్లు
- ఈ 5 కార్లలో మీ ఫ్యామిలీకి ఏది బెస్ట్?
Top Small Family Cars : కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అది కూడా ఫ్యామిలీతో హాయిగా ప్రయాణించేలా, బడ్జెట్‌కు భారంగా మారకుండా ఉండేలా కారు కోసం చూస్తున్నారా? అయితే, మీకోసం మార్కెట్లో కొన్ని మంచి ఆప్షన్లు ఉన్నాయి.
ముఖ్యంగా రూ.10 లక్షల లోపు ఎక్స్‌షోరూమ్ ధరలోనే 5 కార్లు ఇప్పుడు కొనుగోలుదారులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. టాటా పంచ్ నుంచి మారుతి బ్రెజ్జా వరకు మీ అవసరానికి తగ్గ మోడల్‌ను ఎంచుకోవచ్చు. ఇందులో ఏ కారు కొంటారో మీరే డిసైడ్ చేసుకోండి..
1. టాటా పంచ్ :
తక్కువ ధరలో ఎస్యూవీ లాంటి లుక్ కావాలనుకునేవారికి పంచ్ మంచి ఆప్షన్. ప్రారంభ ధర రూ.5.75 లక్షలు ఉంటుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు సీఎన్జీ, మాన్యువల్, ఎఎంటీ ఆప్షన్లు ఉన్నాయి. 366 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఉంది.
2. మారుతి ఫ్రాంక్స్ :
స్టైలిష్ డిజైన్, మంచి ఫీచర్లు కోరుకునేవారికి ఫ్రాంక్స్ నచ్చుతుంది. ప్రారంభ ధర సుమారు రూ.6.89 లక్షలు ఉంటుంది. పెట్రోల్, టర్బో పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్లు ఉన్నాయి. ఎంపిక చేసిన వేరియంట్లలో హెడ్అప్ డిస్ప్లే, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు లభిస్తాయి.
3. హ్యుందాయ్ ఎక్స్టర్ :
సిటీ ప్రయాణాలకు అనువుగా ఉండే ఈ కారు ప్రారంభ ధర రూ.5.80 లక్షలు ఉంటుంది. పెట్రోల్, సీఎన్జీ వెర్షన్లతో పాటు ఎఎంటీ ఆప్షన్ కూడా ఉంది. 6 ఎయిర్‌బ్యాగ్స్, స్టెబిలిటీ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఆకట్టుకుంటాయి..
4. మారుతి స్విఫ్ట్ :
రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు, చిన్న కుటుంబాలకు స్విఫ్ట్ బెస్ట్ ఆప్షన్. దీని ధర రూ.5.83 లక్షల నుంచి మొదలవుతుంది. పెట్రోల్, సీఎన్జీ, మాన్యువల్, ఎఎంటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
5. మారుతి బ్రెజ్జా :
కొంచెం పెద్ద SUV కావాలనుకునేవారికి బ్రెజ్జా బెస్ట్ ఆప్షన్. ప్రారంభ ధర రూ.7.49 లక్షలు ఉంటుంది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, CNG వెర్షన్‌తో పాటు సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఎంపిక చేసిన వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి.
కారు కొనేముందు మీ బడ్జెట్, కుటుంబ సభ్యుల సంఖ్య, రోజువారీ ప్రయాణం, మైలేజీ అవసరాలను బట్టి నిర్ణయం తీసుకోండి. ముఖ్యంగా రూ.10 లక్షల లోపు బడ్జెట్ అంటే అన్ని వేరియంట్లు ఆ ధరలో వస్తాయని అనుకోవద్దు.. ఆన్‌రోడ్ ధర, ఇన్సూరెన్స్, ఇతర ఛార్జీలు కూడా ముందుగానే తెలుసుకోండి..
