Motor Insurance New Rules : కారు, బైక్ ఉన్నవారికి అలర్ట్.. డిసెంబర్ 15 నుంచి కొత్త ఇన్సూరెన్స్ రూల్స్.. ఇవి తెలిస్తేనే పాలసీ తీసుకోండి..!

Motor Insurance New Rules 2026 : డిసెంబర్ 15, 2026 నుంచి మోటార్ ఇన్సూరెన్స్‌లో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కారు, బైక్ యజమానులు తెలుసుకోవాల్సిన 4 కవరేజీలు, కుటుంబ సభ్యుల బీమా మార్పులు, కొత్త పాలసీ వివరాలేంటో చూద్దాం..

Motor Insurance New Rules 2026

  • కారు, బైక్ ఉన్నవారికి బిగ్ అలర్ట్..
  • మోటార్ ఇన్సూరెన్స్‌లో కీలక మార్పులు
  • కొత్త బీమా నిబంధనలతో జాగ్రత్త
  • డిసెంబర్ 15 నుంచి కొత్త ఇన్సూరెన్స్ రూల్స్

Motor Insurance New Rules 2026 : మీ ఇంట్లో కారు ఉందా? లేదంటే బైక్ ఉందా? అయితే, మీకో ముఖ్యమైన విషయం. వాహన బీమా విషయంలో డిసెంబర్ 15, 2026 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.  భారత బీమా నియంత్రణ, అభివృద్ధి అథారిటీ (IRDAI) ఈ మార్పులను తీసుకొచ్చింది.

తద్వారా మోటార్ ఇన్సూరెన్స్ విధానమే మారనుంది. ముఖ్యంగా మీ కారులో ప్రయాణించే కుటుంబ సభ్యుల బీమా విషయంలో వాహనదారులు చాలా అప్రమత్తంగా ఉండాలి.. ఇంతకీ మీరేం చేయాలో ఇప్పుడు చూద్దాం..

4 రకాల కవరేజీలు.. మీ ఇష్టం :

కొత్త విధానం ప్రకారం.. మోటార్ ఇన్సూరెన్స్‌ను 4 విభాగాలుగా విభజించారు. అందులో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, ప్యాసింజర్ లయబిలిటీ కవరేజ్, పర్సనల్ యాక్సిడెంట్ కవర్, ఓన్ డ్యామేజ్ కవర్ ఉన్నాయి. వీటిలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. మిగతా కవరేజీలను వాహనదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఎంచుకోవచ్చు అనమాట..

Read Also : Loan Guarantor Rules : మీ స్నేహితుడి లోన్‌కు గ్యారంటీ ఇచ్చే ముందు జాగ్రత్త.. ఆ అప్పు మీ మెడకు చుట్టుకోవచ్చు!

ఫ్యామిలీకి ఆటోమేటిక్ కవరేజ్ రాదు :
కొత్త నిబంధనల్లో అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే.. ప్యాసింజర్ లయబిలిటీ కవరేజ్ పరిధిలో వాహన యజమాని, వారి తల్లిదండ్రులు, భార్య లేదా భర్త, పిల్లలకు ప్రొటెక్షన్ ఉండదు. అంటే కారులో కుటుంబ సభ్యులతో వెళ్తున్నప్పుడు ప్రమాదం జరిగితే ఈ కవరేజ్ ఆధారంగా వారికి పరిహారం లభిస్తుందని భావించకూడదు. అందుకే కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ తీసుకోవడమే బెటర్..

పాత పాలసీ ఉన్నవారికి ఛాన్స్ :
ఇప్పటికే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉన్నవారు పాలసీని రద్దు చేయాల్సిన అవసరం లేదు. అదనపు ప్రీమియం చెల్లించి ప్యాసింజర్ లయబిలిటీ కవరేజ్‌ను యాడ్ చేయొచ్చు.. అయితే, ఇది అదే బీమా సంస్థ ద్వారా మాత్రమే పొందాల్సి ఉంటుంది.

ఇకపై పాలసీ తీసుకునేటప్పుడు ఏ కవరేజ్‌కు ఎంత ప్రీమియం చెల్లిస్తున్నారో బీమా కంపెనీలు స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. తక్కువ ప్రీమియం ఉందని మాత్రమే పాలసీ తీసుకోవద్దు.. మీ కుటుంబానికి అవసరమైన ప్రొటెక్షన్ ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి..