Rains-Cold Wave Weather: ఒకవైపు వణికిస్తున్న చలి.. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, చలి తీవ్రత!
AP TG Rains - Cold Wave Weather Alert : బంగాళాఖాతంలో ఈ నెల 13న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. మరోవైపు చలి తీవ్రత, పొగమంచు పెరుగుతున్నాయి. పూర్తి వాతావరణ వివరాలివే..
- Sreehari A
- Updated on- November 10, 2026 / 12:43 PM IST
Rain and Cold Conditions Expected in Telugu States
- తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్..
- బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..
- ఈ జిల్లాల్లో వర్షాలు, చలి తీవ్రత
- వాతావరణ శాఖ కీలక అంచనా
AP TG Rains-Cold Wave Weather Alert : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. ఓవైపు చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతుంటే.. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచనలు చేస్తోంది. రానున్న రోజుల్లో వర్షాలు, చలి, పొగమంచు ప్రభావం కనిపించే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది..
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 13న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు యానాం ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత ఏ దిశగా కదులుతుంది? ఎంత బలపడుతుంది? అనే అంశాల ఆధారంగా వర్షాలపై పూర్తి క్లారిటీ రానుంది..
ఇప్పటికే దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి..
తెలంగాణలో చలి పంజా..
మరోవైపు తెలంగాణలో చలి తీవ్రత కూడా క్రమంగా పెరుగుతోంది. ఈశాన్య దిశ నుంచి వీస్తున్న పొడిగాలుల కారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17 నుంచి 19 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఉదయం వేళల్లో పొగమంచు కూడా కనిపిస్తోంది.
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 14 నుంచి 16 డిగ్రీలకు పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజులు చలి, పొగమంచు, వర్షాలతో సాగనున్నాయి. ప్రయాణాలు చేసేవారు, ఉదయం బయటకు వెళ్లేవారు కాస్త జాగ్రత్తగా ఉండటం ఎంతైనా మంచిది.
