121 Kgs Gold Ornaments: తిరుమల శ్రీవారికి రూ.206 కోట్ల బంగారు కానుక.. 46 రకాల ప్రత్యేక ఆభరణాలు.. సాలిగ్రామ హారాలు, కిరీటం, వజ్రాలు, పూర్తి వివరాలు!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో వర్ధమాన్ జైన్ దంపతులు తిరుమల శ్రీవారికి, అమ్మవారికి రూ.206 కోట్ల విలువైన 121 కేజీల బంగారు(121 Kgs Gold Ornaments), వజ్ర, రత్న ఆభరణాలను సమర్పించారు.
- V Santhosh Kumar
- Published on- November 26, 2026 / 05:18 PM IST
Vardhaman jain couple donates 121 kg gold ornaments worth rs 206 Full details
121 Kgs Gold Ornaments: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో వర్ధమాన్ జైన్ దంపతులు భారీ బంగారు కానుక సమర్పించారు. సుమారు రూ.206 కోట్ల విలువైన 121 కిలోల బంగారు (121 Kgs Gold Ornaments)ఆభరణాలను స్వామివారికి అందించారు. ప్రత్యేకంగా 46 రకాల విభిన్న బంగారు ఆభరణాలను రూపొందించి శ్రీవారి సేవలో అర్పించారు. ఈ భారీ కానుకతో భక్తుల భక్తిభావం మరోసారి చాటుకోగా, ఆలయ ఆభరణాల సంపద మరింత పెరిగింది. ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన ఈ సమర్పణ కార్యక్రమం భక్తులలో విశేష ఆసక్తిని కలిగించింది.
ఆభరణాల వివరాలు ఇవే!
* శ్రీవారి ఆభరణాలుగా 106 కిలోల బంగారం
* శ్రీ పద్మావతీ అమ్మవారికి 15 కేజీల బరువైన వస్త్రం
* బంగారు పాద కవచములు -3
*బంగారు అందెలు -3
*బంగారు పాకడాలు
*బంగారు తులసిపాత్ర హారం
*బంగారు అష్టోత్తర కాసుల మాల
*బంగారు చతుర్భుజ లక్ష్మీ హారం
*బంగారు పులిగోరు
*బంగారు అశ్వథ పాత్ర హారము
*బంగారు సాదా వడ్డాణము
*బంగారు గంటల మొలతాడు
*బంగారు సూర్యకటారి
*బంగారు కౌస్తుభం
*బంగారు శ్రీవత్సం
*బంగారు మోచేయి
*బంగారు కటి హస్తం
*బంగారు నాగాభరణ వడ్డాణము
*బంగారు గోపు
*బంగారు ఐదు పేటల కంఠీలు 5
*బంగారు చంద్రవంకీ కంఠీ
*బంగారు వైకుంఠ హస్తము
*బంగారు కటి హస్తము
*బంగారు నాగాభరణ కడియాలు 4
*బంగారు భుజ కీర్తులు 3
*బంగారు కర్ణపత్రములు 3
*బంగారు భావళీలు -3
*బంగారు సాలిగ్రామ హారములు- 3
*బంగారు కమలం తరహా సాలిగ్రామాలు 3
*బంగారు మోపుగల యజ్ఞోపవీతం
*బంగారు శంఖ కవచము
*బంగారు చక్ర కవచము
*బంగారు కిటీపు ముఖపట్టి
*బంగారు కిరీటము
*2,427 క్యారెట్ల బరువున్న నీలం, పుష్యరాగం, కెంపులు, పచ్చలతో శ్రీవత్సం పతకం
*238.2 క్యారెట్ల బరువున్న వజ్రాలను పొదిగిన ఆభరణాలు
