AP Government: ఏపీలో పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. ఒక రోజు ముందే పంపిణీ.. సెర్ప్ కీలక ఆదేశాలు!

ఎన్నికల విధుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఒక రోజు ముందే పెన్షన్లు పంపిణీ చేయాలని సెర్ప్(AP Government) ఆదేశాలు జారీ చేసింది.

Serp orders advance pension distribution on nov 30 and dec 1 in ap

AP Government: ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు పెన్షన్ల పంపిణీపై పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ కీలక ఆదేశాలు జారీ చేస్తూ, నిర్ణీత సమయానికి ఒక రోజు ముందే లబ్ధిదారులకు సొమ్ము అందించాలని స్పష్టం చేసింది(AP Government). ఎన్నికల విధులకు సిబ్బంది హాజరుకావాల్సిన నేపథ్యంలో ఈ ముందస్తు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 2026 నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని మార్గదర్శకాలు ఇచ్చింది.

Telangana Government: తెలంగాణ నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్.. రూ.1.75 లక్షల వరకు సబ్సిడీ.. జీవో 19 జారీ!

రూ.2,707.30 కోట్ల నిధులు.. 61.46 లక్షల మందికి లబ్ధి:

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 61 లక్షల 46 వేల మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తుండగా, ఈ పంపిణీ కోసం రూ.2 వేల 707 కోట్ల 30 లక్షల నిధులను విడుదల చేశారు. నవంబర్ 30వ తేదీన సంబంధిత సిబ్బంది బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రా చేయాలని సెర్ప్ ఆదేశించింది. అదే రోజున వీలైనంత ఎక్కువ మంది లబ్ధిదారుల ఇళ్ల వద్ద పెన్షన్ల పంపిణీ ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని సూచించింది.

డిసెంబర్ 1న మిగిలిన వారికి పంపిణీ పూర్తి:

నవంబర్ 30న పంపిణీ చేయగా ఎవరైనా లబ్ధిదారులు మిగిలిపోతే, వారికి డిసెంబర్ 1వ తేదీన తప్పనిసరిగా పెన్షన్లు అందజేయాలని సెర్ప్ స్పష్టం చేసింది. ఎన్నికల విధుల కారణంగా తలెత్తే షెడ్యూల్ మార్పుల వల్ల లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని లక్షలాది పెన్షన్ లబ్ధిదారులకు సమయానికి ఆర్థిక సహాయం అందనుంది.