AP Rain Alert : ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. అలర్ట్ జారీ..
AP Rain Alert : ఏపీలోని పలు జిల్లాల్లో ఇవాళ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
- Harish Thanniru
- Published on- November 27, 2026 / 07:09 AM IST
AP Weather Updates
AP Rain Alert : ఏపీలో మళ్లీ వర్షాలు దంచికొట్టనున్నాయి. ఇటీవల వరుస తుపానులతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. ఇప్పుడిప్పుడే ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తుపాను సృష్టించిన బీభత్సం నుంచి కోలుకుంటున్న పరిస్థితి. అయితే, బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Also Read : Nandi Awards: నంది అవార్డులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. నవంబర్లో విజేతల జాబితా, డిసెంబర్లో ఘనంగా వేడుక!
శుక్రవారం నెల్లూరు, కర్నూలు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందనిఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
ఇదిలాఉంటే.. గురువారం సాయంత్రం నాటికి గుంటూరు జిల్లా తెనాలిలో 29.4 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. అదేవిధంగా. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో 25 మి.మీ, తిరుపతి జిల్లా పుత్తూరులో 21 మి.మీ, గుంటూరు జిల్లా వడ్లమూడిలో 20.8 మిల్లీ మీటర్లు వర్ష పాతం నమోదైంది.
