AP Politics : మళ్లీ డీలిమిటేషన్ టాక్.. ఏ పార్టీకి మేలు జరుగుతుంది.. ఏపీలో ఆసక్తికర చర్చ..
AP Politics : ఏపీలో కూటమి Vs వైసీపీ ఢీ అంటే ఢీ అన్నట్లుగా పొలిటికల్ ఫైట్ నడుస్తుంది. అయితే ఆశావహుల అసంతృప్తే కూటమికి బిగ్ ఛాలెంజ్‌గా ఉంటూ వస్తుంది. ఇప్పుడు సీట్లు పెరిగితే మ్యాగ్జిమమ్ యాస్పిరెంట్స్ను అకామిడేట్ చేయడం కూటమికి ఈజీ కానుంది.
- Harish Thanniru
- Updated on- November 29, 2026 / 12:39 PM IST
Delimitation
AP Politics :దేశవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్‌సభ సీట్ల పెంపుపై మళ్లీ కదలిక మొదలైంది. స్పెషల్ పార్లమెంట్ సెషన్ రిలీజ్ చేయడంతో పాటు..సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం..ఆ వెంటనే రాజకీయ పార్టీల మద్దతు వెల్లువెత్తుతున్న వేళ..ఏపీ పాలిటిక్స్‌లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ స్టార్ట్ అయింది. సీఎం చంద్రబాబు ఆల్రెడీ ఎన్డీయే కూటమిలో ఉండగా..50శాతం సీట్ల పెంపు ప్రతిపాదనకు ఔట్రైట్ మద్దతు ప్రకటించేశారు. విపక్ష నేత.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా డీలిమిటేషన్ బిల్లుకు సపోర్ట్ చేయడం ఖాయమన్న చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పెంపు అంశం పొలిటికల్ హీట్‌ను పెంచుతోంది.
Also Read : Nara Lokesh : అక్కడ.. ఇక్కడ.. ఎక్కడైనా లోకేశ్ మార్క్ దూకుడు.. పార్టీ క్యాడర్లో జోష్..
లోక్ సభతో సహా అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ, ఎంపీ సీట్లు పెరగడం ఒక ఎత్తు అయితే..మహిళా రిజర్వేషన్లు కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. 50 శాతం సీట్ల పెంపుతో ఏపీలో ప్రస్తుతమున్న 175 అసెంబ్లీ స్థానాలు 263కి చేరనున్నాయి. 25 లోక్‌సభ సీట్లు 38కి పెరుగుతాయి. ఈ లెక్కన పెరిగే సీట్లు..గల్లంతు అయ్యే సెగ్మెంట్లపై చర్చ మొదలైంది. 263 అసెంబ్లీ సీట్లు అయితే..ఏపీలో అధికారంలోకి రావటానికి మ్యాజిక్ ఫిగర్ 132 కానుంది. ప్రతిపక్ష హోదా దక్కాలంటే 26 స్థానాలు రావాల్సి ఉంటుంది. మంత్రివర్గ సభ్యుల సంఖ్య 39 వరకు ఉండనుంది. నియోజకవర్గాల పునర్విభజన, మహిళ కోటా ఇంప్లిమెంటేషన్..ఏపీ పొలిటికల్ సినారియేనే మార్చేయబోతుందన్న చర్చ జరుగుతోంది.
అదనంగా 88 అసెంబ్లీ సీట్లు, 13 ఎంపీ స్థానాలు ఏర్పడుతాయన్న ఆనందం ఒకవైపు ఉంటే..మహిళా రిజర్వేషన్లు నేతలను టెన్షన్ పెడుతున్నాయట. ఏపీలో అసెంబ్లీ సీట్లు 263కి పెరిగితే, ఇందులో 80 సీట్లు మహిళలకు రిజర్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఉమెన్ కోటా అమలులోకి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు గల్లంతు అయ్యే అవకాశం ఉంది. చాలామంది నేతల నియోజకవర్గాల్లో రిజర్వేషన్లు మారే అవకాశం ఉందంటున్నారు. అయితే కూటమి వర్సెస్ వైసీపీలో ఎవరికి మేలు.? ఎవరికి నష్టమన్న డిస్కషన్ స్టార్ట్ అయింది.
మూడు పార్టీలున్న కూటమిలో సీట్ల పంపకాల సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే అంచనాలున్నాయి. పెరిగే సీట్లు వైసీపీకి సవాలుగా మారతాయని కూటమి వర్గాల అంచనా. ప్రజాదరణ పెరిగితే సీట్ల పెంపు ప్రభావం ఉండదనేది వైసీపీ నేతల ధీమా. ఏపీలో ఒక్కసారిగా 50 శాతం సీట్లు అటు లోక్ సభ ఇటు అసెంబ్లీలో పెరుగుతాయి. దాంతో రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రమే మారిపోనుంది. అనేక నియోజకవర్గాల రూపు రేఖలు మారడమే కాదు..కొత్త సెగ్మెంట్లు ఏర్పడటం..నియోజకవర్గాల సరిహద్దులు మారడం చకచకా జరిగిపోనున్నాయి. ఈ చేంజెస్ ఏపీ పొలిటికల్ పిక్చర్ తారుమారు చేసే ఛాన్స్ లేకపోలేదన్న టాక్ నడుస్తోంది.
ఏపీలో కూటమి Vs వైసీపీ ఢీ అంటే ఢీ అన్నట్లుగా పొలిటికల్ ఫైట్ నడుస్తుంది. అయితే ఆశావహుల అసంతృప్తే కూటమికి బిగ్ ఛాలెంజ్‌గా ఉంటూ వస్తుంది. ఇప్పుడు సీట్లు పెరిగితే మ్యాగ్జిమమ్ యాస్పిరెంట్స్ను అకామిడేట్ చేయడం కూటమికి ఈజీ కానుంది. పైగా సీట్ల విషయంలో జనసేన, బీజేపీ కోరుకున్న షేర్ దక్కే ఛాన్సుంది. పైగా అధికారం ఉంది. ఇదే ఊపుతో 132 సీట్లు మ్యాజిక్ ఫిగర్‌ను సాధించడం కూటమికి కష్టమేమి కాకపోవచ్చన్న అంచనాలు బయలుదేరాయి. ఎటు చూసినా డీలిమిటేషన్ కూటమికి మేలే చేస్తుందని అంటున్నారు. ఇక వైసీపీకి డీలిమిటేషన్‌తో కొంత వరకు అడ్వాంటేజెస్ ఉన్నా..మేజర్‌గా సవాళ్లు తప్పవంటున్నారు.
సీట్లు పెరిగితే కూటమిలో సీట్ల పంచాయితీ ఉండదు. అప్పుడు లుకలుకలు ఉండవు కాబట్టి..మరోసారి ఐక్యత చూపించడంతో పాటు.. ఓట్ల చీలిక జరగకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. పైగా ఇప్పుడున్న 175 స్థానాల్లోనే వందకు పైగా నియోజకవర్గాల్లో వైసీపీ ఇంచార్జ్‌లు యాక్టివ్‌గా లేరనే టాక్ ఉంది. 263 సీట్లలో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపడం వైసీపీకి ఇంకో ఛాలెంజ్‌గా మారడం పక్కా అని చెబుతున్నారు.
అయితే వైసీపీ వాదన భిన్నంగా ఉంది. సీట్ల పెంపుతో సంబంధం లేదు..ప్రజలు మార్పు కోరుకుంటే తమ గెలుపును ఎవరూ ఆపలేరని కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. వేవ్‌ను క్రియేట్ చేయగలిగితే..కూటమి పార్టీ లీడర్లు కూడా తమ పార్టీలోకి వచ్చే ఛాన్స్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. డీలిమిటేషన్ ఏపీలో ఎవరికి ఎంత మేలు చేస్తుందో చూడాలి మరి.
