CM Chandrababu: నియోజకవర్గాల పునర్విభజన ఏపీకి మంచి అవకాశం.. లోక్‌సభ సీట్ల 50% పెంచాలి.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నియోజకవర్గాల పునర్విభజన ఆంధ్రప్రదేశ్‌కు మంచి అవకాశమని సీఎం చంద్రబాబు(CM Chandrababu) పేర్కన్నారు.
- V Santhosh Kumar
- Published on- November 27, 2026 / 04:47 PM IST
Cm chandrababu naidu says delimitation is an opportunity for ap
CM Chandrababu: నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఆంధ్రప్రదేశ్‌కు మంచి అవకాశమని, ప్రస్తుత జనాభా ప్రాతిపదికన చేస్తే దక్షిణాదికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నందున లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచడం అన్ని రాష్ట్రాలకు మేలు చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu)మంత్రులకు స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఫోన్ చేసి దిల్లీ రావాలని తనతో పాటు పవన్ కల్యాణ్‌ను కూడా ఆహ్వానించారని, ఈనెల 29 నుంచి తెదేపా, జనసేన, భాజపా ఎంపీలంతా తప్పనిసరిగా దిల్లీలో అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. శనివారం రాజమహేంద్రవరంలో జరిగే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కార్యక్రమానికి హాజరవుతున్నానని, వారికి ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసే విందుకు పవన్‌ను కూడా ఆహ్వానించినట్లు చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో వివరించారు.
AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్.. 30కి పైగా కీలక అంశాలకు ఆమోదం.. రైతులకు భారీ ఊరట!
అమరావతిపై విషప్రచారాలకు అడ్డుకట్ట.. రుషికొండ ప్యాలెస్ పర్యాటక వినియోగం:
అమరావతిపై ప్రతిపక్షం విషప్రచారం చేస్తూ ప్రపంచబ్యాంకు, ఏడీబీకి ఫిర్యాదులతో రాజధాని పనులను అడ్డుకోవాలని చూస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రైతుల పోరాటానికి గుర్తుగా స్మారకం నిర్మించాలన్న లోకేశ్ సూచనకు అంగీకారం తెలిపారు. డిసెంబరు 1న హార్టికల్చర్ హబ్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించిన ముఖ్యమంత్రి, దాని అమలుకు ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేసి సీఈవోను నియమిస్తామని, అలాగే రుషికొండ ప్యాలెస్‌ను పర్యాటక రంగానికి వినియోగించి ప్రజల సందర్శనకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గత ప్రభుత్వ వ్యవహారాలను ప్రజలకు తెలియజేసేలా ప్యాలెస్ వద్ద తక్షణ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేస్తూ, పర్యాటక అభివృద్ధికి సబ్‌కమిటీ సూచనల మేరకు ముందుకు సాగాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
పెట్టుబడుల రక్షణ చట్టం.. ప్రాజెక్టుల పూర్తికి స్పష్టమైన క్యాలెండర్:
పెట్టుబడుల రక్షణ చట్టాన్ని జనవరి నాటికి ఆమోదించి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టుల ప్రారంభం, పూర్తికి స్పష్టమైన క్యాలెండర్ రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేవలం అవగాహన ఒప్పందాలకే పరిమితం కాకుండా పరిశ్రమల నిర్మాణం, ఉత్పత్తి ప్రారంభం వరకు నిర్దిష్ట కార్యాచరణతో పనిచేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
