Nandi Awards: నంది అవార్డులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. నవంబర్‌లో విజేతల జాబితా, డిసెంబర్‌లో ఘనంగా వేడుక!

2017 నుంచి 2025 వరకు పెండింగ్‌లో ఉన్న నంది(Nandi Awards) ఫిల్మ్, టీవీ అవార్డుల ప్రదానోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, డిసెంబర్ 2026లో వేడుకలు నిర్వహించనున్నారు.

AP Government makes key announcement regarding Nandi Awards

Nandi Awards: తెలుగు సినీ, టెలివిజన్ రంగాల కళాకారులు, సాంకేతిక నిపుణులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక నంది అవార్డుల ప్రదానోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఏళ్ల తరబడి నిలిచిపోయిన ఈ పురస్కారాలను మళ్లీ అందించేందుకు ప్రభుత్వం అధికారికంగా చర్యలు ప్రారంభించింది. 2017 నుంచి 2025 వరకు పెండింగ్‌లో ఉన్న నంది అవార్డుల ఎంపిక, ప్రదాన ప్రక్రియను పూర్తి చేసి 2026 డిసెంబర్‌లో వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం సెప్టెంబర్ 22న ప్రభుత్వం జీఓ ఆర్‌టీ నంబర్ 1843 జారీ చేసింది. 2017 నుంచి 2024 వరకు ఏటా ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, రెండో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌తో పాటు రెండు ప్రత్యేక జ్యూరీ అవార్డులు ఇవ్వనున్నారు. అంటే ఎనిమిదేళ్లకు ఏడాదికి నాలుగు చొప్పున పురస్కారాలు ఉంటాయి. 2025 సంవత్సరానికి మాత్రం అన్ని ప్రధాన విభాగాల్లో పూర్తి స్థాయి అవార్డులు అందజేస్తారు. డిసెంబర్ 2026లో జరిగే ఫిల్మ్ అవార్డుల వేడుకకు అమరావతి లేదా విజయవాడ వేదిక కానుండగా, నంది టెలివిజన్ అవార్డుల ప్రదానోత్సవాన్ని తిరుపతిలో నిర్వహించనున్నారు.

Cm Revanth Reddy: త్వరలో మరో 25 వేల ఉద్యోగాలు.. అచ్చంపేట సభలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

టీవీ రంగానికీ ప్రాధాన్యత.. 2012-2016 పురస్కారాలపైనా దృష్టి:

సినిమా రంగంతో పాటు టెలివిజన్ రంగానికీ ప్రభుత్వం సమాన ప్రాధాన్యత కల్పించింది. 2017-2024 మధ్య ప్రతి ఏడాది ఉత్తమ మెగా సీరియల్, రెండో ఉత్తమ మెగా సీరియల్‌తో పాటు రెండు ప్రత్యేక జ్యూరీ అవార్డులు ప్రకటించనున్నారు. 2025కు సంబంధించి టీవీ విభాగంలోనూ అన్ని ప్రధాన కేటగిరీల్లో అవార్డులు ఇవ్వనున్నారు. 2017-2024 విజేతల ఎంపిక పూర్తి చేసి నవంబర్‌లో జాబితా వెల్లడించేలా షెడ్యూల్ సిద్ధం చేశారు. వీటితో పాటు 2012 నుంచి 2016 వరకు ఇప్పటికే ప్రకటించిన నంది ఫిల్మ్, టీవీ అవార్డులను కూడా 2026 నవంబర్‌లో విజయవాడలో ప్రదానం చేయాలని నిర్ణయించారు. ఆయా సంవత్సరాల జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలనూ నిర్వహించనున్నారు.

1964లో మొదలైన నంది ప్రస్థానం.. సినీ ప్రముఖుల హర్షం:

తెలుగు సినిమా, కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో 1964లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది(Nandi Awards) అవార్డులను ప్రారంభించింది. లేపాక్షిలోని ప్రసిద్ధ నంది విగ్రహం స్ఫూర్తితో ఈ పేరు పెట్టారు. తొలుత బంగారు, వెండి, కాంస్య నందులుగా ఇచ్చిన ఈ పురస్కారాలు, ఆ తర్వాత నటీనటులు, దర్శకులు, రచయితలు, సంగీత దర్శకులు, సాంకేతిక నిపుణుల వరకు విస్తరించాయి. దశాబ్దాలుగా కళాకారుల ప్రతిభకు అత్యున్నత గుర్తింపుగా నిలిచిన నంది వేడుకలను పునరుద్ధరించడంపై సినీ, టీవీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.