TS పాలిసెట్-2019 నోటిఫికేషన్ విడుదల

Submitted on 14 March 2019
Telangana Has Released Notification Of Polytechnic Common Entrance Test 2019

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 2019-20 విద్యా సంవత్సరానికి వివిధ ఇంజినీరింగ్ కోర్సుల్లో డిప్లొమా ప్రవేశాలకు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్(SBTET) 'పాలిసెట్ - 2019' నోటిఫికేషన్‌‌ను విడుదల చేసింది.  
Read Also : మే 22 డీఈఈసెట్ పరీక్ష
* విద్యా అర్హత: 
ఈ కోర్సుల్లో ప్రవేశానికి పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి..లేదా  ప్రస్తుతం పరీక్ష రాస్తున్న అభ్యర్థులు అయిన దరఖాస్తు చేసుకోవచ్చు. 
* దరఖాస్తు విధానం:
అభ్యర్థులు మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 4 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
* పరీక్ష ఫీజు: 
జనరల్ అభ్యర్థులు రూ.400; SC, ST అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. ఈ ఏడాది ఏప్రిల్ 16న పాలిసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. పాలిసెట్ ఫలితాలను ఏప్రిల్‌ 24న వెల్లడించనున్నారు.
* ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా. 
* పరీక్ష విధానం: 
ప్రవేశ పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. మ్యాథమెటిక్స్-60, ఫిజిక్స్-30, కెమిస్ట్రీ-30 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. పరీక్ష సమయం 2 గంటలు. అర్హత మార్కులు 36గా నిర్ణయించారు. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైనవారు మూడేళ్లు, మూడున్నరేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందుతారు. 

* ముఖ్యమైన తేదీలు..

నోటిఫికేషన్ విడుదల  13.03.2019.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం   14.03.2019.
పాలిసెట్ పరీక్ష తేదీ   16.04.2019.
ఫలితాలు 24.04.2019.
Notification Released
Polytechnic Common Entrance Test
2019

మోడీ Vs చంద్రబాబు రాజకీయ యుద్ధం వల్ల ఏపీకి న్యాయం జరుగుతుందా?

Choices

మరిన్ని వార్తలు