కేసీఆర్ ఔదార్యం : వృద్ధుడి కోసం ఆగి..సమస్య తెలుసుకుని

Submitted on 27 February 2020
Telanagana cm kcr generosity

తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ వృద్ధుడి సమస్యను పరిష్కరించారు. మానవత్వంతో ఆయన చెప్పిన విషయాలను విని..వెంటనే అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ఇదేదో..మీటింగ్‌లో..ప్రగతి భవన్‌లో జరిగింది కాదు. నడి రోడ్డుపై. అవును. సీఎం కేసీఆర్..2020, ఫిబ్రవరి 27వ తేదీ గురువారం మధ్యాహ్నం ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు టోలిచౌకి వెళ్లారు. తిరిగి వస్తున్నారు. మార్గమధ్యలో ఓ వృద్దుడు చేతిలో స్టిక్‌..మరో చేతిలో ఏదో పేపర్ పట్టుకుని నిలబడ్డాడు. ఇది కేసీఆర్‌కు కనిపించింది. వెంటనే కారును ఆపివేయించారు. 


కారులో నుంచి స్వయంగా దిగి..ఆ వృద్ధుడి వద్దకు చేరుకున్నారు. సమస్యను అడిగి తెలుసుకున్నారు. తన పేరు మహ్మద్ సలీం అని తెలిపారు. గతంలో డ్రైవర్‌గా పనిచేసినట్లు, 9 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు వెల్లడించారు. నాలుగు సంవత్సరాల క్రితం బిల్డింగ్‌పై నుంచి కింద పడడంతో కాలు విరిగిందని, తన కొడుకు ఆరోగ్యం బాగా లేదని..ఉండడానికి ఇల్లు కూడా లేదని వాపోయాడు. తగిన సహయం చేయాలని కోరాడు. 


వెంటనే సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. వికలాంగుల పెన్షన్, డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేయాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతిని ఆదేశించారు. దీంతో సీఎం ఆదేశాల మేరకు టోలిచౌకిలో నివాసం ఉంటున్న సలీమ్ నివాసానికి కలెక్టర్, ఇతర అధికారులు వెళ్లారు. విచారణ జరిపారు. వికలాంగుడని ధృవీకరిస్తూ..సర్టిఫికేట్ ఉండడంతో అప్పటికప్పుడు పెన్షన్ మంజూరు చేశారు. జియాగూడలో డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేశారు. సీఎంఆర్ఎఫ్ పథకం కింద కొడుకుకు, ప్రభుత్వ వైద్య ఖర్చులతో సలీమ్‌కు చికిత్సలు చేయిస్తామని అధికారులు ప్రకటించారు. 

Read More : కాలితో తన్నిన కానిస్టేబుల్‌పై కేటీఆర్ ఆగ్రహం

 

Telanagana
CM KCR
generosity
tolichowki

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు