2019 వరల్డ్ కప్ భారత ఆటగాళ్ల సత్తా ఇది..

Submitted on 15 April 2019
TEAM INDIA INDIVIDUAL STRENGTH FOR 2019 WORLD CUP

నెలల తరబడి వరల్డ్ కప్‌కు సరిపడేలా భారత జట్టులో ఎంపికలు చేపట్టిన సెలక్షన్ కమిటీ.. ప్లేయర్లలో ఏం గమనించింది. వారి రికార్డులేంటి. వారిని తీసుకోవడానికి గల కారణాలు ఏంటని పరిశీలిస్తే...

విరాట్ కోహ్లీ:
కెప్టెన్.. ఆడిన 227 మ్యాచ్‌ల్లో 10,843 పరుగులు సాధించాడు. వన్డే ఫార్మాట్‌లో కోహ్లీ అత్యధిక స్కోరు 183పరుగులుగా ఉంది. 59.57 యావరేజ్‌తో 92.96 స్ట్రైక్ రేట్‌తో దూసుకుపోతున్నాడు. కోహ్లీ కెరీర్‌లో 49 హాఫ్ సెంచరీలు, 41 సెంచరీలు ఉన్నాడు. ఇప్పటికీ రెండు 2011, 2015 వరల్డ్ కప్‌లలో ఆడిన అనుభవంతో పాటు అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు కెప్టెన్‌గానూ ఘనత దక్కించుకున్నాడు. 

రోహిత్ శర్మ: 
వైస్ కెప్టెన్.. ఆడిన 206 మ్యాచ్‌ల్లో 8,010 పరుగులు సాధించాడు. వన్డే ఫార్మాట్‌లో రోహిత్ అత్యధిక స్కోరు 264పరుగులుగా ఉంది. 47.39 యావరేజ్‌తో 87.95 స్ట్రైక్ రేట్‌తో దూసుకుపోతున్నాడు. రోహిత్ కెరీర్‌లో 41 హాఫ్ సెంచరీలు, 22 సెంచరీలు ఉన్నాడు. ఇప్పటికీ 2015 వరల్డ్ కప్‌లో ఆడిన అనుభవంతో పాటు.. జట్టుకు అత్యవసర సమయంలో కెప్టెన్‌గానూ సేవలందించడగలడు. 

మహేంద్ర సింగ్ ధోనీ:
వికెట్ కీపర్.. టీమిండియా మాజీ కెప్టెన్‌గా ఉంటూ జట్టుకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నాడు. 2 సార్లు వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్న ధోనీ వికెట్ కీపర్‌గా జట్టును చక్కగా నడిపించగలడు. ఆడిన 341 మ్యాచ్‌ల్లో 10,500 పరుగులు సాధించాడు. వన్డే ఫార్మాట్‌లో ధోనీ అత్యధిక స్కోరు 183పరుగులుగా ఉంది. 50.72 యావరేజ్‌తో 87.55 స్ట్రైక్ రేట్‌తో దూసుకుపోతున్నాడు. ధోనీ కెరీర్‌లో 71 హాఫ్ సెంచరీలు, 10 సెంచరీలు ఉన్నాయి. 314 క్యాచ్‌లతో వికెట్లు పడగొట్టడంతో పాటు 120 స్టంప్ అవుట్‌లు ధోనీ ఖాతాలో ఉన్నాయి. 

కేఎల్ రాహుల్:
మూడు లేదా నాలుగు స్థానాల్లో బ్యాటింగ్‌ దిగేందుకు జట్టులోకి తీసుకున్న కేఎల్ రాహుల్.. అవసరమైతే ఓపెనర్ గానైనా పనికొస్తాడనే అంచనా వేసింది సెలక్షన్ కమిటీ. ఆడింది 14 మ్యాచ్ లే అయినా 343 పరుగులు చేశాడు. రాహుల్ అత్యధిక స్కోరు 100తో నాటౌట్‌గా నిలిచాడు. అతని కెరీర్లో 2 హాఫ్ సెంచరీలు ఉండగా, ఒక్క సెంచరీ మాత్రమే ఉంది. ప్రపంచ కప్‌లో ఏ మాత్రం అనుభవం లేనిప్లేయర్. 

కేదర్ జాదవ్:
ఆల్ రౌండర్.. ప్రస్తుతం ఫామ్‍‌లో దూసుకెళ్తున్న ప్లేయర్. ఆడింది 59 మ్యాచ్‌లే అయినా 1174 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 120 నమోదు చేయగా, 43.48 యావరేజ్‌తో 102.53 స్ట్రైక్ రేట్‌తో కొనసాగుతున్నాడు. కెరీర్లో 5 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు ఆల్ రౌండర్ గా రాణించే జాదవ్.. బౌలింగ్‌లోనూ మెరుపులు సృష్టించాడు. 27 వికెట్లు పడగొట్టిన కేదర్.. అత్యుత్తమంగా 3/23తో 5.15 చక్కటి ఎకానమితో కొనసాగుతున్నాడు. వరల్డ్ కప్ అనుభవం లేదు. 

హార్దిక్ పాండ్యా:
ఆల్ రౌండర్.. ఆడింది 45 మ్యాచ్‌లు. చేసింది 731 పరుగులు. అత్యధిక స్కోరు 83కాగా, యావరేజ్ 29.24తో 116.58 స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు. కెరీర్లో 4 హాఫ్ సెంచరీలు ఉండగా కేవలం ఒక్క సెంచరీ మాత్రమే ఉంది. బౌలర్‌గా 44 వికెట్లు పడగొట్టిన పాండ్యా.. అత్యుత్తమంగా 3/31తో నిలిచాడు. ప్రపంచ కప్ జట్టులో ఆడిన అనుభవం లేదు. 

విజయ్ శంకర్:
ఆల్ రౌండర్.. ఆడింది 9 మ్యాచ్‌లు. చేసింది 165 పరుగులు. అత్యధిక స్కోరు 46కాగా, యావరేజ్ 33.00తో 96.49 స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు. బౌలర్‌గా 2 వికెట్లు పడగొట్టిన శంకర్.. అత్యుత్తమంగా 2/15తో నిలిచాడు. ప్రపంచ కప్ జట్టులో ఆడిన అనుభవం లేదు. 

రవీంద్ర జడేజా:
ఆల్ రౌండర్.. ఆడింది 151 మ్యాచ్‌లు. చేసింది 2035 పరుగులు. అత్యధిక స్కోరు 87కాగా, యావరేజ్ 29.92తో 84.23 స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు. కెరీర్లో 10 హాఫ్ సెంచరీలు ఉండగా కేవలం ఒక్క సెంచరీ కూడా లేదు. బౌలర్‌గా 174 వికెట్లు పడగొట్టిన జడేజా.. అత్యుత్తమంగా 5/36తో నిలిచాడు. 2015 ప్రపంచ కప్ జట్టులో ఆడిన అనుభవం పనికొస్తుందని భావిస్తున్నారు. 

దినేశ్ కార్తీక్:
వికెట్ కీపర్.. ఆడిన 91 మ్యాచ్‌ల్లో 1738 పరుగులు సాధించాడు. వన్డే ఫార్మాట్‌లో కార్తీక్ అత్యధిక స్కోరు 79పరుగులుగా ఉంది. 31.03 యావరేజ్‌తో 73.70 స్ట్రైక్ రేట్‌తో దూసుకుపోతున్నాడు. కెరీర్‌లో 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 61 క్యాచ్‌లతో వికెట్లు పడగొట్టడంతో పాటు 7 స్టంప్ అవుట్‌లు ఖాతాలో వేసుకున్నాడు. 

యజ్వేంద్ర చాహల్: 
స్పిన్నర్.. ఆడింది 41 మ్యాచ్‌లు అయినా 72వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమంగా 6/42సాధించాడు. 24.61 యావరేజ్‌తో 4.89ఎకానమితో కొనసాగుతున్నాడు. ప్రపంచ కప్ లో ఆడిన అనుభవం లేదు. 

కుల్దీప్ యాదవ్:
స్పిన్నర్.. స్పిన్నర్.. ఆడింది 44 మ్యాచ్‌లు అయినా 87వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమంగా 6/25సాధించాడు. 21.74 యావరేజ్‌తో 4.93ఎకానమితో కొనసాగుతున్నాడు. ప్రపంచ కప్‌లో ఆడిన అనుభవం లేదు. 

భువనేశ్వర్ కుమార్:
ఫేసర్.. ఆడింది 105 మ్యాచ్‌లు అయినా 118వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమంగా 5/42 సాధించాడు. 35.66 యావరేజ్‌తో 5.01ఎకానమితో కొనసాగుతున్నాడు. 2015 ప్రపంచ కప్‌లో ఆడిన అనుభవం కలిసొస్తుంది. 

మొహమ్మద్ షమీ:
ఫేసర్.. ఆడింది 63 మ్యాచ్‌లు అయినా 113వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమంగా 4/35 సాధించాడు. 26.11 యావరేజ్‌తో 5.48ఎకానమితో కొనసాగుతున్నాడు. 2015 ప్రపంచ కప్‌లో ఆడిన అనుభవం కలిసొస్తుంది. 

జస్ప్రిత్ బుమ్రా: 
ఫేసర్.. ఆడింది 49 మ్యాచ్‌లు అయినా 85 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమంగా 5/27సాధించాడు. 22.15 యావరేజ్‌తో 4.51ఎకానమితో కొనసాగుతున్నాడు. ప్రపంచ కప్‌లో ఆడిన అనుభవం లేదు.

Team India
2019 icc world cup
ICC WORLD CUP 2019

మరిన్ని వార్తలు