సీఎం జగన్‌‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

Submitted on 11 July 2019
TDP to move privilege motion against CM Jagan

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం సాగింది. సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య అసెంబ్లీ గురువారం(11 జులై 2019) ముగియగా.. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు చంద్రబాబు. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్‌పై శుక్రవారం(12 జులై 2019) సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. వడ్డీ రాయితీ ఇవ్వలేదంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. సభను తప్పుదోవ పట్టించారని ఆయన విమర్శించారు.

తమ వాదనను వినిపించే అవకాశం ఇవ్వకుండా సభను వాయిదా వేసుకుని పారిపోయారని అన్నారు. ఈ విషయమై తాను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

అసెంబ్లీలో జగన్‌ అహంభావంతో మాట్లాడుతున్నారే తప్ప సబ్జెక్టు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వడ్డీ రాయితీ ఇవ్వలేదంటూ తప్పుడు ప్రచారం చేశారని, సభను తప్పుదోవ పట్టించారని విమర్శలు చేశారు.

TDP
Privilege motion
cm jagan


మరిన్ని వార్తలు