సీఎం జగన్‌‌ను కలిసిన వల్లభనేని వంశీ

Submitted on 11 July 2019
TDP MLA Vallabhaneni vamsi Meets CM Jagan

సీఎం జగన్‌‌తో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఆయన వైసీపీ గూటికి చేరుతారా ? అనే చర్చలు స్టార్ట్ అయ్యాయి.  అయితే ఇటీవలే..సీఎం జగన్‌కు వల్లభనేని ఓ లేఖ రాశారు. పోలవరం కుడి కాల్వ నుంచి నీటి మళ్లింపు చేయాలంటే విద్యుత్ అవసరమని..అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు వల్లభనేని వంశీ. అందులో భాగంగానే వల్లభనేని..2019, జూలై 11వ తేదీ గురువారం సాయంత్రం జగన్‌తో భేటీ అయ్యారని తెలుస్తోంది. 

గతంలో నీటిని మళ్లించడానికి 500 మోటార్లు అవసరమయ్యేవని..కరెంటును గత ప్రభుత్వం ఫ్రీగానే ఇచ్చిందని వల్లభనేని గుర్తు చేశారు. అలాగే...ఇప్పుడు కూడా విద్యుత్ సరఫరా ఇచ్చేలా APSPDCL అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని జగన్‌ను ఆయన కోరారు. పోలవరం కుడి కాల్వల నుంచి గోదావరి జలాలను గన్నవరం నియోజకవర్గంలోని మెట్ట గ్రామాలకు తరలించేందుకు సహకరించాలని కోరారు. వల్లభనేని విజ్ఞప్తులకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. 

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చెందింది. కేవలం 23 మంది సీట్లను మాత్రమే కైవసం చేసుకుంది. అయితే..ఎన్నికైన టీడీపీ ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ కొంతమంది హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. అచ్చెన్నాయుడు, కరణం బలరాం, మద్దాల గిరిధర్, చిన రాజప్ప ఎన్నికను సవాల్ చేస్తూ...వైసీపీ నేతలు కోర్టులో పిటిషన్‌లు దాఖలు చేస్తున్నారు. వల్లభనేని ఎన్నిక చెల్లదంటూ..గన్నవరం నియోజకవర్గం వైసీపీ యార్లగడ్డ అభ్యర్థి వెంకట్రావు హైకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జగన్‌ను వల్లభనేని కలవడం చర్చనీయాంశమైంది.

TDP MLA
Vallabhaneni vamsi
meet
cm jagan


మరిన్ని వార్తలు