టీడీపీ కార్యకర్త కత్తితో వీరంగం

Submitted on 16 September 2019
 TDP activist clash with AP village volunteer

గ్రామ వాలంటీర్ పై టీడీపీ కార్యకర్త కత్తితో వీరంగం సృష్టించిన ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. నగరంలోని మండలం చల్లమ్మ అగ్రహారంలో గ్రామంలో పలు పథకాలకు అర్హులైన వారి పేర్లతో జాబితాను వాలంటీర్లు తయారు చేస్తున్నారు. గత ప్రభుత్వ హాయాంలో నిర్మించుకున్న ఇంటికి బిల్లులు అందించాలని ఓ టీడీపీ కార్యకర్త గొడవకు దిగాడాని, అంతేగాకుండా కత్తితో బెదిరించినట్లు గ్రామ వాలంటీర్ ఆరోపించారు.

గతంలో నిర్మించిన ఇంటికి ఇప్పుడు బిల్లు  ఎలా వస్తుందని తాను ప్రశ్నించడంతో ఘర్షణకు దిగినట్లు తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులకు కంప్లయింట్ చేస్తానని వెల్లడించాడు. 

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకొంటోంది జగన్ ప్రభుత్వం. అందులో భాగంగా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు, అవినీతి ఆస్కారం లేకుండా చేయాలని గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశ పెట్టారు. నేరుగా ప్రభుత్వ పథకాలు ఇంటికే డెలివరీ చేసేందుకు వాలంటీర్లను నియమించింది. 
Read More : గురజాల సభకు నో పర్మిషన్ : పోలీసుల నోటీసు తీసుకోని కన్నా

tdp activist
clash
AP village volunteer

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు