హ్యాట్సాఫ్ : పాముల బావిలో దిగి నెమలిని రక్షించిన యువకుడు

Submitted on 2 December 2019
Tamilnadu man rescued life peacock from snake infested well

బావిలో పడిపోయిన నెమలి కోసం ప్రాణాలకు తెగించించి దిగాడు ఓ యువకుడు. అది తమిళనాడు రాష్ట్రంలోని ఓ వ్యవసాయ బావి. బావిలో 30 అడుగుల లోతు వద్ద నీరు ఉన్న్ ఆ బావిలో ఎన్నో పాములు ఉన్నాయి. ఈత వచ్చినవారు కూడా ఆ బావిలో దిగాలనే సాహసం చేయరు.అందులో ఉంటే పాములకు భయపడిపోతారు. ఆ బావిలో ఓ నెమలి పడిపోయింది. ఆ నెమలిని రక్షించటానికి ఓ యువకుడు సాహసం చేశాడు.

ఆ బావి గురించి తెలిసి కూడా నెమలిని రక్షించం కోసం..తాళ్ల సహాయంతో చాలా చాకచక్యంగా బావిలోకి దిగి పాములను తప్పించుకుంటూ ఎట్టకేలకు ఆ నెమలిని రక్షించాడు. బావిలోంచి తీసుకొచ్చిన ఆ నెమలిని బైట వదలగానే రెక్కలు విప్పుకుని ఎగురుకుంటూ వెళ్లిపోయింది ఆ మయూరం. అతను అలా నెమలిని రక్షిస్తుండగా కొందరు వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెమలిని ప్రాణాలకు తెగించి మరీ రక్షించిన ఆ వ్యక్తిని అందరూ అభినందిస్తున్నారు..!

tamilnadu
man
RESCUED
life peacock
snake infested well

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు